Breaking News

భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం.. అడ్డుగా ఉన్నాడని హత్య


భర్త స్నేహితుడితో పెట్టుకున్న భార్య తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్నోడినే హత్య చేయించింది. ఇందుకోసం ప్రియుడికి రూ.5వేల ఆర్థిక సాయం కూడా చేసింది. భర్త అడ్డు లేకపోవడంతో ప్రియుడితో ఎంజాయ్ చేద్దామని ప్లాన్ వేసుకున్న ఆమెకు పోలీసులు చెక్ పెట్టారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంటకు చెందిన నక్క రామారావు(42) తాపీమేస్త్రీ. అతడి వద్ద ఒడిశాలోని గజపతి జిల్లా కాశీనగర్‌కు చెందిన దామండల శివ(34) కొద్దిరోజులుగా పనిచేస్తున్నాడు. శివ తన ప్రవర్తనతో కొద్దిరోజుల్లోనే రామారావుకు దగ్గరయ్యాడు. దీంతో వారు స్నేహితులుగా మారారు. ఈ బంధాన్ని అడ్డుపెట్టుకుని శివ తరుచూ రామారావు ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే అతడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. రామారావు లేని సమయంలో వారిద్దరూ రాసలీలలు కొనసాగించేవారు. ఈ విషయం రామారావుకు తెలియడంతో భార్యను హెచ్చరించాడు. అనైతిక బంధాన్ని మానుకుని బుద్ధిగా కాపురం చేసుకోవాలని సూచించాడు. దీంతో తమ బంధానికి అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రియుడు శివకు రూ.5వేలు ఇచ్చింది. ఈ నెల 14వ తేదీన మద్యం తాగుదామంటూ శివ.. రామారావును ఓ నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ మద్యం తాగిన తర్వాత శివ బాటిల్‌తో రామారావు గొంతు కోసి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా శివపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. హత్య జరిగిన రోజు నుంచి అతడు కనిపించకపోవడంతో శివే హత్య చేసి ఉంటాడని నిర్ధారించుకుని అతడి స్వస్థలానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నాడు. ఈ హత్యలో రామారావు భార్య హస్తం కూడా ఉందని శివ చెప్పడంతో సోమవారం ఆమెను అరెస్ట్ చేసినట్లు బాలానగర్‌ డీసీపీ పద్మజ తెలిపారు.


By August 27, 2019 at 08:36AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-woman-kills-husband-with-lover-due-to-illegal-affair/articleshow/70851584.cms

No comments