Breaking News

వీడిన తేజస్విని మిస్సింగ్ మిస్టరీ.. అనుమానంతో చంపేసిన ప్రియుడు


జిల్లా పెనుబల్లి మండలంలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన పాలిటెక్నిక్ విద్యార్థిని తేజస్విని ఉదంతం విషాదంగా మారింది. ప్రియుడిని నమ్మి నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన యువతి అతడి చేతిలోనే బలైపోయింది. రెండ్రోజులగా కనిపించకుండా పోయిన తమ కూతురు తిరిగొస్తుందని ఆశతో ఎదుచుచూసిన ఆమె తల్లిదండ్రులకు పుట్టెడు శోకం మిగిలింది. Also Read: పెనుబల్లి మండలం కుప్పినకుంట్లకు చెందిన కావిటి తేజస్విని(20) సత్తుపల్లిలో పాలిటెక్నిక్ చదివింది. కొన్ని సబ్జెక్టులు మిగిలిపోవడంతో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. గతంలో తనతోనే చదివిని నితిన్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో కౌన్సిలింగ్ ఇప్పించారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం నితిన్ ఖమ్మంలో బీటెక్ చదువుతున్నాడు. అయితే తేజస్విని ఇటీవల వేరే యువకుడితో చనువుగా ఉంటోందని అతడికి అనుమానం కలిగింది. దీనిపై ఇద్దరూ చాలాసార్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ఆదివారం తేజస్వినికి ఫోన్ చేసిన నితిన్ కొంచెం మాట్లాడాలని చెప్పి ఆమెను బైక్‌పై లంకపల్లి గుట్టలపైకి తీసుకెళ్లాడు. ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో ఆగ్రహానికి లోనైన నితిన్ ఆమె గొంతు నులిచి చంపేసి మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. Also Read: మరోవైపు తమ కుమార్తె కనిపించడం లేదంటూ తేజస్విని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నితిన్ అనే యువకుడిపై అనుమానం ఉందని చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అతడి ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఖమ్మంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి కాల్‌డేటా పరిశీలించి తేజస్వినికి ఆఖరి కాల్ చేసింది అతడేనని గుర్తించారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో నితిన్‌ని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. నితిన్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు తేజస్విని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read:


By August 27, 2019 at 11:25AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-murdered-by-her-lover-in-khammam-district/articleshow/70853515.cms

No comments