వార్ ట్రైలర్: దుమ్మురేపుతున్న హృతిక్, టైగర్ ష్రాఫ్ యాక్షన్
బాలీవుడ్ సూపర్‌స్టార్స్ , టైగర్ ష్రాఫ్ తొలిసారి ‘వార్’ చిత్రంతో వెండితెరపై సందడి చేయనున్నారు. ఒకరు ప్రతినాయకుడి పాత్రలో మరొకరు అతన్ని పట్టుకునే పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ట్రైలర‌్‌ను చిత్రందం విడుదల చేసింది. విభిన్న గెటప్స్‌లో అందరినీ చంపేస్తుంటాడు హృతిక్. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు టైగర్‌ను రంగంలోకి దింపుతారు. కానీ హృతిక్ కూడా ఇందులో పోలీసు అధికారేనని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. సినిమాలో వాణీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా, సిద్ధార్థ్ ఆనంద్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని సినిమాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
By August 27, 2019 at 12:18PM
No comments