బాలికపై అత్యాచారయత్నం.. కాపాడిన ఇంటి యజమాని

ఆడపిల్లలకు బయటే కాదు ఇంట్లోనూ రక్షణ లేకుండా పోయింది. బాలికతో పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఆమె ఇంటికే వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఇంటి యజమాని అప్రమత్తం కావడంతో మృగాడి బారి నుంచి బాధితురాలు బయటపడింది. నగర శివారులోని మైలార్‌దేవిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ బస్తీలో నివాసముండే దంపతులకు 12ఏళ్ల బాలిక ఉంది. వారి ఇంటి యజమాని కొడుకు బాలరాజ్ ఆ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. అప్పడప్పుడు ఆమెతో చనువుగా వ్యవహరించేవాడు. ఇటీవల బాలిక కుటుంబం ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్లిపోయింది. బాలికపై కన్నేసిన బాలరాజ్ సోమవారం ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసుకుని వెళ్లాడు. తన కోరిక తీర్చాలని బాలికను కోరగా ఆమె తిరస్కరించింది. ఆమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేయబోయాడు. ఆ ఇంట్లో నుంచి ఏవో శబ్ధాలు వినిపించడంతో ఇంటి యజమాని తలుపు తట్టాడు. ఎవరూ తీయకపోయేసరికి స్థానికుల సాయంతో తలుపులు బద్దలు కొట్టాడు. బాల్‌రాజ్ చేస్తున్న అఘాయిత్యాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
By August 13, 2019 at 11:27AM
No comments