Breaking News

ఐదేళ్లలో లక్ష కోట్ల పెట్టుబడులను రప్పిస్తాం: ప్రధాని మోదీ


వచ్చే ఐదేళ్లలో దేశంలోకి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచే దిశగా కేంద్రం పాలసీలను రూపొందిస్తుందన్నారు. ఎకనామిక్ టైమ్స్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన మోదీ.. పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. 2008-14 మధ్య సాధించిన పురోగతి లాంటిది కాకుండా.. దీర్ఘకాలిక వృద్ధి రేటు కోసం పని చేస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించడం తమపై మరింత బాధ్యతను పెంచిందన్న ప్రధాని.. అంచనాలు కూడా భారీగా ఉన్నాయన్నారు. గత ఐదేళ్లలో సానుకూల పురోగతి నమోదైందన్నారు. గత ఫిబ్రవరి, జూలై నెలల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావాన్ని ప్రజలు విశ్లేషించాలన్నారు. బడ్జెట్లో ఎవరికి ఏ కేటాయింపులు చేశారని కాకుండా స్థూలంగా దేశ ప్రగతి కోణంలో ఆలోచించాలన్నారు. ‘‘గత ఐదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాం. ఆర్థికంగా బలంగా ఉన్న ప్రపంచ దేశాలతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నాం. వడ్డీరేట్లు తగ్గించాం. జీఎస్టీ, బ్యాంక్‌రప్టసీ కోడ్ లాంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాం. నిరర్థక ఆస్తుల సమస్యను పరిష్కరిస్తున్నాం. మౌలిక వసతుల పెంపును వేగంగా పెంచుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు భారత్‌ను అద్భుత గమ్యంగా మార్చాం’’ అని మోదీ పేర్కొన్నారు.


By August 12, 2019 at 10:31AM


Read More https://telugu.samayam.com/business/business-news/we-are-targeting-rs-100-lakh-crore-worth-of-investment-in-the-coming-five-years-says-pm-modi/articleshow/70638171.cms

No comments