Breaking News

భర్త ప్రియురాలిని దారుణంగా హత్యచేసిన మహిళ


వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త కుటుంబాన్ని పట్టించుకోవడం లేదన్న కారణంగా భార్య హంతకురాలిగా మారింది. భర్త ప్రియురాలిని నమ్మించి మట్టుబెట్టింది. జిల్లా మండలం ముదెల్లికి చెందిన పట్నాల అంజయ్య అనే వ్యక్తి.. సమీపంలోని దక్కల్‌దానితండాలో నివసించే బోడ అరుణ(25) అనే యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో అంజయ్య రోజూ రాత్రి ఇంటికి వెళ్లి భార్య, పిల్లలతో గొడవలు పడుతున్నాడు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన అతడి భార్య కాశవ్వ ఆరా తీయగా తనకు పరిచయస్తురాలైన అరుణతో అఫైర్ విషయం తెలిసింది. Also Read: తన కుటుంబంలో కలహాలు రావడానికి అరుణే కారణమని భావించిన కాశవ్వ ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుంది. గురువారం అరుణను బాన్సువాడ తీసుకెళ్లిన కాశవ్వ బంధువుల గ్రామంలో జాతర ఉందని నమ్మించి గాలీపూర్ గేటు వద్దకు తీసుకెళ్లింది. ఈలోగా ముదెల్లికి చెందిన సుతారి బాలయ్య అనే వ్యక్తి అక్కడ సిద్ధంగా ఉన్నాడు. బాలయ్య కూడా వారిద్దరితో మాటలు కలిపి నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ ప్రదేశం చూసి అనుమానమొచ్చిన అరుణ ఇక్కడికెందుకు వచ్చామంటూ నిలదీయగానే బాలయ్య ఆమెను కింద పడేసి మెడకు టవల్ బిగించాడు. Also Read: ఆ వెంటనే కాశవ్వ సమీపంలోని పెద్ద బండరాయితో అరుణ తలపై మోది చంపేసింది. తర్వాత వారిద్దరు మృతదేహాన్ని అక్కడే వదిలేసి ముదెల్లి వెళ్లిపోయారు. అరుణ రాత్రయినా రాకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికి పోలీసులకు ఫిర్యాదుచేశారు. అరుణతో చివరిసారిగా కాశవ్వను చూశామని స్థానికులు చెప్పగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో శుక్రవారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read:


By August 31, 2019 at 11:19AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/wife-brutally-kills-husband-lover-in-nizamabad-district/articleshow/70920332.cms

No comments