Breaking News

కష్టపడి దొంగతనానికి వచ్చా. ఏం లేకపోతే ఎలా?: దొంగ లేఖ


సాధారణంగా ఏదైనా చోరీ జరినప్పడు దొంగులు ఏదో ఒక క్లూ వదిలి పోలీసులకు దొరికి పోతుంటారు. అయితే ఓ దొంగ.. షాపునకు కన్న వేసి, ఏకంగా యజమానికి ఉత్తరం రాసి వదిలి వెళ్లాడు. నవ్వు తెప్పిచే ఈ వింత ఘటన శుక్రవారం (ఆగస్టు 2) తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడలూరు చిల్లాలోని మందారకుప్పంలో జయరాజ్ అనే వ్యక్తి దుకాణం నడుపుతున్నాడు. నిత్యం రద్దీగా ఉండే ఆ షాపును గమనించి దొంగ కన్నం వేసి దోచుకోవాలని భావించాడు. గత గురువారం అర్ధరాత్రి అతి కష్టం మీద దుకాణం పైభాగానికి చేరుకున్నాడు. టైల్స్ తొలగించి షాపులోకి దూరాడు. డబ్బు కోసం క్యాష్ కౌంటర్‌తోపాటు దుకాణమంతా వెతికాడు. అయినా చిల్లిగవ్వ కూడా దొరకలేదు. దీంతో నిరాశ చెందిన ఆ దొంగ ఏకంగా ఉత్తరం రాసి పెట్టి వెళ్లిపోయాడు. ‘నేను ప్రాణాన్ని పణంగా పెట్టి ఎంతో కష్టపడి దొంగతనానికి వచ్చాను. క్యాష్ కౌంటర్‌లో ఒక్క రూపాయి కూడా పెట్టకపోవడం మీకేమైనా భావ్యమా?’అంటూ లేఖలో ప్రశ్నించాడు. దుకాణంలోని పప్పు దినుసులు పట్టుకెళ్లి ఏం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు. చిర్రెత్తుకొచ్చే ఉత్తరం రాస్తున్నానంటు అందులో పేర్కొన్నాడు. Read also: శుక్రవారం ఉదయాన్ని దుకాణం తెరిచిన జయరాజ్ షాపులో సామగ్రి అంతా చిందరవందరగా ఉండటం చూసి షాక్‌కి గురయ్యాడు. జరిగి ఉంటుదని భావించాడు. షాపులో వస్తువులేం మాయం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అయితే తమిళంలో రాసి ఉన్న ఉత్తరం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు చేతిరాత ఆధారంగా ఆ వింత దొంగను పట్టుకోవడానికి గాలిస్తున్నారు.


By August 03, 2019 at 10:36AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/thief-leaves-letter-to-shop-owner-in-tamilnadu/articleshow/70508312.cms

No comments