Breaking News

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?


బిగ్ బాస్ సీజన్ 1 జరిగినంత ఇంట్రెస్టింగ్ గా మిగిలిన సీజన్స్ జరగడంలేదు. సీజన్ 2 ,3 లో ఎవరు వీకెండ్ లో ఎలిమినేట్ అవుతున్నారో ముందే తెలిసిపోతుంది. శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్లని శనివారమే చిత్రీకరించేస్తూ వుంటారు. దీనివల్ల ముందే ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలిసిపోతుంది.

సస్పెన్స్ ను మెయింటైన్ చేయడంలో బిగ్ బాస్ టీమ్‌ విఫలమయింది. సో ఈ వీక్ కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలిసిపోయింది. అందరు ఊహించన విధంగానే తమన్నా ఈ వారం ఎలిమినేట్‌ అయింది. వైల్డ్ కార్డు ఎంట్రీ తో వచ్చిన తమన్నా సింహాద్రి వెళ్లిన రెండో రోజే అలీ తో సున్నం పెట్టుకుంది. అలీ ని ఏదిపడితే అది మాట్లాడింది. ఈమె బిహేవియర్ ప్రేక్షకులకి ఎవరికి నచ్చలేదు అందుకే ఆమెను ఎలిమినేట్ చేసారు.

ఫ్యామిలీ చూసే షో కాబట్టి నోటిని అదుపులో వుంచుకోవడం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమయింది. గత సీజన్ లో ఇటువంటి బిహేవియర్ తో ఇలానే నటి తేజస్విని షో నుండి త్వరగా వెళ్లిపోయింది. ఏదిఏమైనా బిగ్ బాస్ టీం ఎలిమినేషన్ విషయంలో సస్పెన్స్ ని మెయింటైన్ చేయడంలేదు అని అర్ధం అవుతుంది.



By August 12, 2019 at 04:00AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47036/tamanna-simhadri.html

No comments