Article 370 రద్దు ఏకపక్ష నిర్ణయం, సుదీర్ఘ పోరాటానికి సిద్ధం: ఒమర్ అబ్దుల్లా
రద్దు, జమ్మూ కశ్మీర్ విభజన పట్ల ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ఏకపక్షంగా ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుందన్న ఆయన.. భారత ప్రభుత్వంపై కశ్మీర్ ప్రజలు ఉంచిన నమ్మకాన్ని కేంద్రం వమ్ము చేసిందన్నారు. ఈ నిర్ణయం తీవ్ర పర్యావసనాలకు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. ఇది కశ్మీర్ ప్రజలపై దురాక్రమణగా ఆయన అభివర్ణించారు. ‘‘ఆర్టికల్ 370 రద్దు లాంటి పెద్ద నిర్ణయాలేవీ తీసుకోవడం లేదని భారత ప్రభుత్వం, ప్రభుత్వ ప్రతినిధులు మాకు చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రం మొత్తాన్ని, ముఖ్యంగా కశ్మీర్ ప్రాంతాన్ని సైనిక శిబిరంగా మార్చేసి ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ప్రజల గొంతుకను వినిపించే మాలాంటి వారిని నిర్బంధంలో ఉంచారు. లక్షలాది సైనికులను మోహరించారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు చేయడం ద్వారా భారత్‌లో చేరికనే ప్రశ్నిస్తున్నట్లయ్యింది. అక్రమంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా, ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ వ్యతిరేకిస్తోంది. సుదీర్ఘమైన, కఠిన పోరాటం ముందుంది. మేం దానికి సిద్ధంగా ఉన్నాం’’ అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
By August 05, 2019 at 01:38PM
No comments