Amaravati రైతులను మోసం చేసి భూముల్ని కొన్నారు.. విజయసాయి మరో ట్విస్ట్!
రాజధాని వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. రాజధాని తరలింపు ఖాయమని జరుగుతోన్న ప్రచారంపై టీడీపీ మండి పడుతోంది. ఈ విషయంలో బీజేపీ కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తోంది. రాజధాని రైతుల త్యాగాలు మర్చిపోవద్దంటూ.. బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్‌కు సూచించారు. రాజధానిని తరలిస్తే చెప్పకుండా ఎలా ఉంటామని ప్రశ్నించిన .. అమరావతి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని బుధవారం ప్రకటించారు. తాజాగా ఆయన రాజధాని విషయంలో టీడీపీ, బీజేపీ నేతలపై సెటైర్లు వేశారు. రాజధానిని తరలించేందుకే ముంపునకు గురి చేశారని వాదిస్తోన్న నేతలకు ఆయన చురకలు అంటించారు. ‘‘అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకే ముంపునకు గురిచేశారని గగ్గోలు పెడుతున్నవారెవరో గమనించారా? చంద్రబాబు, సుజనా, కేశినేని, సిఎం రమేశ్, లోకేశ్, కోడెల, ఉమ, వీళ్ల బినామీలు, “కావాల్సిన” వాళ్లు వేల ఎకరాల భూములు రైతులను మోసం చేసి కొన్నారు. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయన్నదే వీరి ఏడుప’’ని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో సోము వీర్రాజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని విజయసాయి ఆరోపించారు. ఇప్పుడు కన్నాను తప్పించి తన విధేయుడిని అధ్యక్షుడిగా నియమించేందుకు సుజనా, సీఎం రమేశ్‌ల ద్వారా లాబీయింగ్ బాబు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత విమర్శించారు. ఢిల్లీలో పరిణామాల్ని వీళ్లిద్దరూ ఎప్పటికప్పుడు తమ బాస్‌కు బ్రీఫ్ చేస్తుంటారని విజయసాయి ట్వీట్ చేశారు.
By August 23, 2019 at 11:48AM
No comments