9నెలల చిన్నారిపై హత్యాచారం.. నిందితుడికి ఉరిశిక్ష
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన 9నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు ప్రవీణ్‌కు మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. 30కి పైగా సాక్షులను విచారించిన కోర్టు ప్రవీణ్ నేరం చేసినట్లు నిర్ధారించింది. కేవలం 40 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుపై ప్రజలు, సామాజిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి ఈ తీర్పు భయం కలిగిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో నిందితుడిపై తరపున ఎవరూ వాదించకూడదని చిన్నారి తల్లిదండ్రులు జగన్, రచన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసముంటున్నారు. జగన్ ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుండగా, రచన గృహిణి. పెళ్లియిన ఐదేళ్ల తర్వాత పుట్టిన పాపకు శ్రీహిత అని పేరు పెట్టకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. జూన్ నెలలో పాపకు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు వేములవాడకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో హన్మకొండలోని పాప అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. జూన్ 19వ తేదీన రాత్రి ఇంట్లో ఉక్కపోతగా ఉండటంతో అంతా డాబాపై పడుకున్నారు. Also Read: ఈ విషయాన్ని గమనించిన ప్రవీణ్ అనే యువకుడు అర్ధరాత్రి వేళ చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప ఏడుస్తుండటంతో చంపేశాడు. చిన్నారి పక్కన లేకపోవడంతో కంగారుపడిన జగన్, రచన చుట్టపక్కల వెతికారు. ఓ నిర్మానుష్య ప్రాంతంలో ప్రవీణ్ పాపతో కనిపించడంతో అతడిని చితక్కొట్టి చిన్నారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే పాప అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రవీణ్‌ను అదుపులోకి 366, 302, 376ఎ, 376 ఏబీ, 379 ఐపీసీ సెక్షన్లతో పాటు 5(ఎం) రెడ్‌విత్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ 2012 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
By August 08, 2019 at 01:59PM
No comments