Breaking News

‘ఆ మంత్రి మా బంధువే.. రూ.5లక్షలిస్తే జాబ్ పక్కా’


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తుండటం కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. దీన్ని ఆసగారా తీసుకుని ప్రభుత్వోద్యోగం ఇప్పిస్తామంటూ కొందరు కేటుగాళ్లు నిరుద్యోగులకు వల వేస్తున్నారు. తాజా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి పేరుతో ఓ ప్రభుత్వోద్యోగి వసూళ్లకు తెరదీశాడు. ఓ యువకుడికి రూ.5లక్షలిస్తే పంచాయతీ సెక్రటరీ జాబ్ ఇప్పిస్తానని నమ్మించాడు. విషయం బయటకు రావడంతో పోలీసులు నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు. జిల్లా మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న పోరుమామిళ్ల రమేశ్‌బాబు అనే వ్యక్తి నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. అదే జిల్లాకు చెందిన అహ్మద్ అనే వ్యక్తికి పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.5లక్షలు వసూలు చేశాడు. ఇంతటితో ఆగకుండా ‘మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డీ నాకు బంధువులే. ఐదు లక్షలిస్తే డైరెక్ట్‌గా సచివాలయ సెక్రటరీ పోస్ట్‌ ఇప్పిస్తా’ అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారానికి దిగాడు. ఈ ప్రకటన చూసిన చాలామంది నిరుద్యోగులు అతడిని సంప్రదించారు. ఈ విషయం మంత్రి పెద్దిరెడ్డి కార్యదర్శికి తెలియడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలన్నీ పారదర్శకంగా జరుగుతాయని, ఇలాంటి మోసగాళ్ల చేతుల్లో నిరుద్యోగులు మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


By August 28, 2019 at 10:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-held-for-cheating-youth-on-name-of-govt-jobs-in-kadapa/articleshow/70870035.cms

No comments