‘సాహో’ రెస్పాన్స్.. అక్కడ లీస్ట్ 4 స్టార్స్!!
ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించిన ‘సాహో’ శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా ఇమేజ్‌తో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిజల్ట్ ఏంటి?, రెస్పాన్స్ ఏంటి? అంటే మాత్రం ఒక్కో దగ్గర ఒక్కో రకమైన మాట వినిపిస్తుంది. ఇది చాలా తక్కువ సినిమాలకు మాత్రమే ఇలా జరుగుతుంది. నేటివిటీ, లోకల్ లాంగ్వేజ్, డొమెస్టిక్ స్టార్డమ్ లాంటి ఫ్యాక్టర్స్ వల్ల సాధారణంగా ఇలాంటి టాక్ వస్తుంటుంది. కానీ ‘సాహో’ లాంటి యూనివర్సల్ అప్పీల్ ఉన్న కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాకు ఒక్కో దగ్గర ఒక్కో రకమయిన టాక్ రావడం మాత్రం విచిత్రం. తెలుగు నుండి నేషనల్ హీరోగా ఎదిగాడు కాబట్టి ఇక్కడ ప్రభాస్‌కి ఉండే ఫ్యాన్‌బేస్ వేరు. పైగా ప్రభాస్ ఫ్రెండ్లీ నేచర్ వల్ల అందరి హీరోల ఫ్యాన్స్ కూడా ప్రభాస్ సినిమాపై సాఫ్ట్ కార్నర్‌తో ఉంటారు. అందుకే అతని సినిమా మరీ బాగాలేకపోతే తప్ప ఫ్లాప్ అనే మాట అంత తొందరగా స్ప్రెడ్ కాదు. అయితే ‘సాహో’కి మాత్రం తెలుగు స్టేట్స్‌లో మొదటి రెండు ఆటలకు టాక్ ఒక మోస్తరుగా ఉంది అనే వచ్చింది. సినిమా మరీ తీసికట్టుగా ఉంది అనే మాట ఎక్కడా పెద్దగా వినిపించలేదు. కానీ సాయంత్రం నుండి జనరల్ ఆడియన్స్ కూడా సినిమాకి వెళ్లడంతో టాక్‌లో చాలా తేడా కనిపించింది. Also Read: సెకండ్ హాఫ్‌లో ఉన్న కన్ఫ్యూషన్‌తో ఎవరికి వాళ్ళు సినిమా ఏమీ అర్థం కాలేదు అనే రిపోర్ట్ ఇచ్చారు. దాంతో అప్పటివరకు ఉన్న ఒక మోస్తరు సినిమా అనే టాక్ కూడా వీకైపోయింది. అయితే, ఈ సినిమాకి పంజాబ్‌లో మాత్రం ఊహించని టాక్ వచ్చింది. అక్కడ వాళ్ళు బాలీవుడ్ తప్ప మిగతా లోకల్ లాంగ్వేజ్ సినిమాలను పెద్దగా పట్టించుకోరు. కానీ, ‘బాహుబలి’ లాంటి ఎపిక్ సినిమాలో హీరో అయిన ప్రభాస్ నటించిన మూవీ కావడంతో పంజాబ్‌లో సైతం హౌస్‌ఫుల్స్‌తో ‘సాహో’ తన రన్ మొదలుపెట్టింది. విచిత్రంగా పంజాబ్ ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకి కూడా ‘సాహో’ బాగా నచ్చింది. ప్రతి ఒక్కరూ సినిమా సూపర్ అనేస్తున్నారు. రేటింగ్ ఎంత అంటే 5 స్టార్స్ అంటున్నారు. అక్కడ ‘సాహో’కి వచ్చిన లీస్ట్ రేటింగ్ 4 స్టార్స్. అక్కడివాళ్లకు ఈ సినిమా ఎందుకు అంతలా కనెక్ట్ అయ్యింది అంటే వాళ్ళు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు అనే మాట తప్ప వేరే కారణం కనిపించట్లేదు. ఇక తెలుగు సినిమాల హవాని పెద్దగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్న బాలీవుడ్‌కి ‘సాహో’లో ఉన్న లోపాలు ఆయుధాలుగా మారాయి. దాంతో అక్కడి క్రిటిక్స్ అంతా ‘సాహో’ని చీల్చి చెండాడారు. ఆ ఎఫెక్ట్ బాలీవుడ్ వెర్షన్ కలెక్షన్స్‌పై కొంతవరకు ప్రభావం చూపించింది. దాంతో అక్కడ టాక్ కూడా పూర్తిగా నెగెటివ్‌గా స్ప్రెడ్ అయ్యింది.
By August 31, 2019 at 12:49PM
No comments