ఆర్టికల్ 370 రద్దు: రెండుగా జమ్మూ కశ్మీర్.. క్షణాల్లో రాష్ట్రపతి ఆమోదం!
జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నాటి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేసింది. అంతాసిద్ధం చేసిన తర్వాత రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం కీలక ప్రకటన చేశారు. అమిత్ షా ప్రకటన వెలువడిని నిమిషాల్లో రాష్ట్రపతి గెజిట్ విడుదల చేశారు. కశ్మీర్ అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతుందనే ఊహాగానాలకు మోదీ సర్కారు తెరదించింది. కేంద్రం నిర్ణయంతో కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయినట్టుయ్యింది. అలాగే జమ్మూ కశ్మీర్‌ను రెండుగా విభజించింది. జమ్మూ కశ్మీర్‌కు అసెంబ్లీతోపాటు కేంద్రపాలిత ప్రాంతం, లద్దాఖ్‌ను ప్రత్యేకంగా కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తూ ప్రతిపాదనలు రూపొందించింది. చట్ట సభలేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్‌ను గుర్తించింది. ఆర్టికల్ 370 వల్ల రాజ్యాంగం ప్రకారం ఇతర రాష్ట్రాలకు వర్తించే నిబంధనలు జమ్మూ కశ్మీర్‌కు వర్తించవు. దీనిపై ముందుగానే అన్ని సిద్ధం చేసుకున్న మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి గెజిట్ విడుదల చేసింది. దీని ప్రకారమే 1965 వరకూ ఆ రాష్ట్రానికి సీఎం బదులు ప్రధాని, గవర్నర్ స్థానంలో రాష్ట్రపతి ఉండేవారు. తాజాగా ఆర్టికల్‌ను రద్దుచేయడంతో ప్రత్యేక అధికారాలు, హక్కులు కశ్మీరీలు కోల్పోనున్నారు. పార్లమెంటులో చేసిన ప్రతిచట్టం కశ్మీరీలకు వర్తిస్తుంది. ఈ ఆర్టికల్‌ను సంస్థానాధీశుడు రాజా హరి సింగ్ వద్ద దివాన్‌గా పని చేసిన గోపాలస్వామి అయ్యంగార్ రూపొందించారు. అయితే, గతంలో ఆర్టికల్ 370 పట్ల రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
By August 05, 2019 at 11:56AM
No comments