Breaking News

రిలయన్స్ చరిత్రలో తొలిసారి.. 20 శాతం వాటాల విక్రయం: ముకేశ్ అంబానీ


రియలన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సమావేశం సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ ఆసక్తిర వివరాలను వెల్లడించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చరిత్రలోనే తొలిసారిగా 20 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. సౌదీ ఆర్మ్‌కో ఆర్ఐఎల్‌ ఆయిల్, కెమికల్ విభాగంలో 20 శాతం వాటాలను కొనుగోలు చేస్తుందన్నారు. ఈ వాటాల విక్రయం విలువ 75 బిలియన్ డాలర్లని తెలిపారు. వాటాల విక్రయం పూర్తయ్యాక సౌదీ అర్మాకో సంస్థ ప్రతిరోజూ ఐదు లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్‌ను రిలయన్స్ రిఫైనరీలకు సరఫరా చేస్తుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయన్న అంబానీ.. 2030 నాటికి దేశం పది లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు. దేశ అతిపెద్ద ఎగుమతిదారుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచిందన్నారు. రిటైల్ బిజినెస్‌లో 49 శాతం వాటాలను విక్రయించడం ద్వారా రిలయన్స్ రూ.7 వేల కోట్లను ఆర్జిస్తుందని అంబానీ తెలిపారు. రిలయన్స్.. సరికొత్త రిలయన్స్‌గా మారుతుందని ముకేశ్ అంబానీ వెల్లడించారు. జియో మూడో వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న జియో ఫైబర్ సర్వీసులను ప్రారంభిస్తామని అంబానీ తెలిపారు. 2 కోట్ల నివాసాలకు జియో గిగాఫైబర్ సేవలను అందిస్తామన్నారు.


By August 12, 2019 at 12:00PM


Read More https://telugu.samayam.com/business/business-news/reliance-agm-2019-saudi-aramco-to-buy-20-percent-stake-in-ril-oil-to-chemical-business/articleshow/70639178.cms

No comments