పెంపుడు కూతురితో 13ఏళ్లుగా వ్యభిచారం.. పెళ్లయినా వదలని రాక్షసుడు
పెంపుడు కూతురితో వ్యభిచారం చేయిస్తూ వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తికి జిల్లా చిలకలూరిపేట పోలీసులు చెక్ పెట్టారు. వ్యభిచారం ఇక చేయనన్న పాపానికి ఆమెను గొడ్డును బాదినట్లు బాదడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. AlsoRead: గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ప్రభుదాస్ అలియాస్ వీరారావు అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం ఎక్కడి నుంచో బాలికను తీసుకొచ్చి పెంచుకుంటున్నాడు. ఆమెకు యుక్త వయస్సు రాగానే బెదిరించి వ్యభిచార కూపంలోకి దించాడు. రోజూ ఇంటికే విటులను తీసుకొచ్చి పెంపుడు కూతురితో వ్యభిచారం చేయించేవాడు. ఈ క్రమంలో ఆమెకు పెళ్లయి ఇద్దరు బిడ్డలు పుట్టారు. అయితే వీరారావు తరుచూ కూతురిని పుట్టింటికి తీసుకెళ్లి నెలలకు నెలలు అక్కడే ఉంచుకుంటుండటంతో ఆమె భర్తకు అనుమానం వచ్చింది. దీంతో ఆయన ఆరా తీయగా తన భార్యతో వీరారావు వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలిసింది. AlsoRead: దీంతో అతడు భార్య, పిల్లలను వదిలేశాడు. దీంతో ఆమె దిక్కలేని స్థితిలో వీరారావు వద్దే ఉండి వ్యభిచారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే వచ్చిన ఆదాయాన్ని కుటుంబ పోషణకు ఇవ్వకుండా వీరారావే జల్సాలకు ఖర్చు చేసుకుంటుండంతో బాధితురాలు ఎదురుతిరిగింది. తానింక వ్యభిచారం చేయమని, ఏదైనా కూలిపని చేసుకుని జీవిస్తానని చెప్పి పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిపోయింది. గత మంగళవారం పెంపుడు కూతురి ఇంటికి వెళ్లిన వీరారావు తనతో రావాలని ఆమెను బెదిరించాడు. కాదనడంతో గొడవకు దిగి సుత్తితో తలపై కొట్టాడు. దీంతో బాధితురాలు 22వ తేదీన పోలీసులకు ఫిర్యాదుచేసింది. పెంపుడు తండ్రి 13ఏళ్లుగా తనను బెదిరించి వ్యభిచారం చేయిస్తున్నాడని, అతడి బారి నుంచి కాపాడాలని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న చిలకలూరిపేట పోలీసులు సోమవారం వీరారావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. AlsoRead:
By August 27, 2019 at 10:30AM
No comments