Breaking News

చికెన్ పకోడి అడిగిన చిన్నారి.. బ్రిడ్జి పైనుంచి తోసేసిన తాగుబోతు


మద్యం మత్తులో ఉన్న యువకుడిని కావాలని అడిగిన చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా వెల్లవేడు వద్ద జరిగింది. వెల్లవేడు వద్దనున్న ఇటుక బట్టీలో ఒడిశా నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలు పనిచేస్తున్నాయి. అక్కడే పనిచేసే నిలక్కర్‌ అనే యువకుడు రెండ్రోజుల క్రితం ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను బజారుకు తీసుకెళ్లాడు. తెలిసిన వ్యక్తే కావడంతో నిలక్కర్‌తో కలిసి ఆ చిన్నారి ఉత్సాహంగా వెళ్లింది. ఆ మరుసటి రోజు ఉదయం ఇటుక చాంబర్ వద్దే తీవ్ర గాయాలతో చిన్నారి శవమై కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న అందుకున్న వెళ్లవేడు పోలీసులు అక్కడికి చేరుకుని నిలక్కర్‌తో పాటు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిలక్కరే నిందితుడని నిర్ధారించుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం చెప్పాడు. చిన్నారికి చాక్లెట్లు కొనిస్తానని బజారుకు తీసుకెళ్లానని, వచ్చేటప్పుడు తనకోసం మద్యం, చికెన్ పకోడి తెచ్చుకున్నట్లు నిలక్కర్ పోలీసులకు తెలిపారు. ఇటుక చాంబర్ సమీపంలోనే బ్రిడ్జి వద్ద బైక్ ఆపి మద్యం తాగుతుండగా చిన్నారి చికెన్ పకోడి కావాలని పదేపదే అడగడంతో చిరాకు వచ్చి వంతెన పైనుంచి తోసేసినట్లు చెప్పాడు. బాలిక చనిపోవడంతో శవాన్ని తీసుకొచ్చి ఆమె ఇంటి సమీపంలో పడేసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు నిందితుడు నిలక్కర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చికెన్ పకోడి అడినందుకే చిన్నారి హత్యకు గురికావడంతో స్థానికంగా విషాదం నెలకొంది.


By July 18, 2019 at 08:52AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamil-nadu-drunk-man-kills-5yr-old-girl-child-for-chicken-pakodi/articleshow/70270519.cms

No comments