Breaking News

ఆరేళ్ల బాలుడిపై లైంగికదాడి.. కామాంధుడికి పదేళ్ల జైలు


జిల్లా సంగం మండలంలో ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడికి కోర్టు పదేళ్ల జైలుశిక్ష, రూ.50వేల జరిమానా విధించింది. సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడు నాన్నమ్మతో కలిసి ఉంటున్నారు. 2014 నవంబర్ 25న బాలుడికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో అతడిని ఇంట్లోనే ఉంచి నాన్నమ్మ పనికి వెళ్లింది. మధ్యాహ్న సమయంలో బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన యర్రబెల్లి పెంచలరావు అనే వ్యక్తి బొంగరం కొనిస్తానని చెప్పి అతడిని సమీపంలోని బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ పెంచలరావు లైంగిక దాడికి పాల్పడటంతో బాలుడు కేకలు పెట్టాడు. దీంతో ఏం జరిగిందోనని స్థానికులు బావి దగ్గరికి చేరుకున్నారు. వారి రాకతో భయపడిన పెంచలరావు అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం ఇంటికి చేరుకున్న బాలుడి నాన్నమ్మకు స్థానికులు విషయం చెప్పడంతో ఆమె అదేరోజు సంగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నిందితుడికి వ్యతిరేకంగా అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు కోర్టుకు సమర్పించారు. శుక్రవారం తుది వాదనలు విన్న ఒకటో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి రమేశ్‌కుమార్ నిందితుడికి పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.50వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.


By July 06, 2019 at 09:23AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/six-year-old-boy-sexually-assaulted-10-years-jail-for-accused/articleshow/70100808.cms

No comments