Breaking News

మరో హామీ అమలుకు జగన్ అడుగులు.. ఆ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు!


తాము అధికారంలోకి వస్తే బీసీల్లోని 139 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తామని ఎన్నికల సమయంలో జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ హామీ మేరకు కార్పొరేషన్లు ఏర్పాటుకు జగన్ ఆదేశాలు జారీచేశారు. సీఎం ఆదేశాలతో దృష్టిసారించింది. వెనుకబడిన తరగతుల్లోని వివిధ కులాల కోసం కొత్తగా 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ఆ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ప్రజాసాధికార సర్వే ప్రకారం వెనుకబడిన తరగతుల్లో రెండు వేల లోపు జనాభా ఉన్న కులాలు 37, వందల్లోనే జనాభా ఉన్న కులాలు 24 ఉన్నాయి. ఈ 39 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటుచేయడం వల్ల నిర్వహణ భారం ఎక్కువ అవుతుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ జనాభా ఉన్న కులాలు, వృత్తి సామీప్యత ఉన్న వాటిని కలిపి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా రూపొందించారు. ప్రస్తుతం బీసీ కార్పొరేషన్‌తో పాటు 24 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఉన్నాయి. 32 కులాలకు కలిపి అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషన్‌ ఉంది. Read Also: వాస్తవానికి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో బలహీనవర్గాల్లోని మరో మూడు కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ముదిరాజ్/ ముత్రాసి/తెనుగోళ్లు సహకార ఆర్థిక సంస్థలు, ఏపీ నగరాలు/నగవంశ సహకార ఆర్థిక సంఘం, నీరాగీత కార్మిక సహకార ఆర్థిక సంస్థపై గతంలో తీసుకున్న నిర్ణయం అమలుచేయాలని భావించారు. బీసీ కార్పొరేషన్‌కు ఒక అపెక్స్ బాడీని ఏర్పాటుచేయాలని భావించారు. కార్పొరేషన్ల పనితీరు ఎప్పటికప్పుడు ఆధ్యయనం, నిర్వహణ సులభతరం చేయడంలో అపెక్స్‌బాడీ కీలకపాత్ర వహిస్తుంది. కార్పొరేషన్ల పరిధిలోకి రాని మిగిలిన బీసీ కులాల వారికి కూడా దీనివల్ల న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తమైంది. ఏపీ సహకార సంఘాల చట్టం-1964 కింద ఈ కార్పొరేషన్లు ఏర్పాటుచేయనున్నట్టు అప్పట్లో ప్రకటించారు. కొత్తగా ఏర్పాటైన బీసీ కార్పొరేషన్లకు మేనేజింగ్ కమిటీల రూపురేఖలను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ కమిటీలలో చైర్మన్‌తో సహా ఆరుగురు అనధికార సభ్యులు ఉంటారని పేర్కొన్నారు. అధికారిక సభ్యులుగా బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్, చైర్మన్, సహకార సంఘాల రిజిస్ట్రార్, సెర్ప్ సీఈఒ, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, పరిశ్రమలశాఖ డైరెక్టర్, స్కిల్ డెవలప్‌మెంట్ సీఈఒ సభ్యులుగా వ్యవహరిస్తారు. అధికారిక మేనేజింగ్ కమిటీకీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. సంబంధిత కార్పొరేషన్ ఎండీ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది.


By July 20, 2019 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/andhra-government-likely-to-establish-sixteen-new-bc-corporations/articleshow/70301960.cms

No comments