Breaking News

నన్ను ఇద్దరు ఎత్తుకెళ్లారు.. రోజూ ఇడ్లీ తినిపించారు: జషిత్


మండపేటలో మూడు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన క్షేమంగా తిరిగొచ్చాడు. పోలీసుల గాలింపు, మీడియాలో వచ్చిన కథనాలతో భయపడిన కిడ్నాపర్లు బాలుడిని అనపర్తిలోని కుతుకులూరు వద్ద బుధవారం అర్ధరాత్రి రోడ్డుపై వదిలేసి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు బాలుడిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రుల చెంతకు చేరిన జషిత్‌ను పోలీసులు ఆరా తీశారు. విచారణలో జషిత్ చెప్పి విషయాలను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. ‘నేను ఆడుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు నన్ను ఎత్తుకెళ్లారు. ఓ ఇంట్లో దాచి ఉంచారు. రోజూ ఇడ్లీనే పెట్టారు. కిడ్నాపర్లలో రాజు అనే అంకుల్ నాకు తెలుసు. అతడే నన్ను రాత్రి బైక్‌పై తీసుకొచ్చి రోడ్డు పక్కన వదిలేశాడు’ అని జషిత్ చెబుతున్నాడు. Also Read: జషిత్ చెప్పిన వివరాల ప్రకారం రాజు అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జషిత్ నివాసముండే కాలనీలో గాని, అతడి తల్లిదండ్రులకు పరిచయమున్న వారిలో రాజు అనే పేరుగల వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


By July 25, 2019 at 09:08AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-persons-kidnapped-me-says-mandapeta-boy-jashith-to-police/articleshow/70372839.cms

No comments