క్యాబ్ డ్రైవర్ నిర్వాకం.. పక్కింటి మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీశాడు

పక్కింటి మహిళపై కన్నేసిన ఓ ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీసేందుకు ప్రయత్నించి జైలు పాలయ్యాడు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సద్దాం షేక్ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ బెహ్రాంబాగ్ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. పక్కింట్లో భర్తతో కలిసి ఉంటున్న ఓ మహిళపై కన్నేసిన సద్దాం షేక్ ఆమెను ఎలాగైనా లోబరుకోవాలని పథకం వేశాడు. పక్కింటి బాత్‌రూమ్‌లో తన సెల్‌ఫోన్ అమర్చాడు. బుధవారం స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌కి వెళ్లిన మహిళ పైకప్పుకు, గోడకు మధ్యవున్న గ్యాప్‌లో ఫోన్ ఉన్నట్లు గమనించి భర్తకు చెప్పింది. అతడు సెల్‌ఫోన్‌ను పరిశీలించగా అది వీడియో రికార్డింగ్ మోడ్‌లో ఉంది. దీంతో ఆ ఫోన్‌ను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి పక్కింట్లో ఉండే సద్దాం షేక్ చేసిన నిర్వాకమని గుర్తించి అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సెల్‌ఫోన్‌ను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.
By July 12, 2019 at 09:20AM
No comments