Breaking News

చంద్రబాబూ.. మీ పెంపుడ్ని కుక్కల్ని కంట్రోల్‌లో పెట్టండి: కేశినేని నాని


విజయవాడ టీడీపీలో ట్వీట్ వార్ ముదిరింది. ఎంపీ , ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచారు. విజయవాడ ఎంపీ ఈసారి నేరుగా అధినేత చంద్రబాబుకే ట్వీట్ గురి పెట్టారు. పార్టీలో ఉండాలా వద్దా చెప్పండంటూ ప్రశ్నించారు. రాజీనామాకు సిద్ధమంటూ బాంబు పేల్చారు. నాని ట్వీట్‌లో ‘చంద్రబాబు గారు.. నాలాంటి వాళ్లు పార్టీలో వద్దనుకుంటే చెప్పండి.. ఎంపీ పదవితో పాటూ పార్టీకి రాజీనామా చేస్తా. నా లాంటి వాళ్లు కావాలనుకుంటే మీ పెంపుడు కుక్కలను కంట్రోల్‌ చేయండి’అంటూ ఘాటుగా స్పందించారు. నాని చేసిన ఈ ట్వీట్ మరింత వేడిని పెంచింది. టీడీపీలోనూ ఆసక్తికర చర్చ మొదలయ్యింది. ఇక ఈ ట్వీట్ వార్‌కు పుల్‌స్టాప్ పెడుతున్నట్లు తెలిపారు. ‘బలహీన వర్గాలకి చెందిన నాకు ఎం ఎల్ సి పదవి ఇచ్చిన గారికీ విశ్వాస పాత్రుడిని దానికి నువ్వు ఏ పేరు పెట్టినా నాకు ఇష్టమే ...చంద్రబాబు గారీ కొసం పార్టీ కోసం ఈ ట్వీట్ల యుద్దం ఆపేస్తున్నాను’అన్నారు.


By July 15, 2019 at 09:07AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-mp-kesineni-nani-hot-tweet-on-mlc-buddha-venkanna/articleshow/70221883.cms

No comments