‘జబర్దస్త్’ వినోద్‌పై దాడి కేసు నిందితుల అరెస్ట్... రిమాండ్‌కు తరలింపు
‘జబర్దస్త్’ కామెడీ షో నటుడు వినోద్(వినోదిని)పై దాడి చేసిన కేసులో ఐదుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేశారు. వినోద్‌పై కర్రతో దాడి చేసిన ప్రమీలతో పాటు ఆమె కుటుంబసభ్యులు బాలాజీ, అభిషేక్, ఉదయ్‌కుమార్ సంధ్యను అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపారు. నిందితులపై ఐపీసీ 323, 506 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని, సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని కేసు దర్యాప్తు అధికారి మధు తెలిపారు. జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్‌లతో పాపులర్ అయిన నటుడు వినోద్ అలియాస్ వినోదినిపై గత శనివారం (జులై 20) దాడి జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని కుత్బిగూడలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న వినోద్‌పై ఓ ఇల్లు కొనుగోలు అంశంలో ఆ ఇంటి యజమాని, అతడి కుమారులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వినోద్ ఆసుపత్రితో చికిత్స పొందుతున్నారు. తనపై ఇంటి ఓనర్ కుటుంబం హత్యాయత్నం చేసిందని కాచిగూడ పోలీస్ స్టేషన్లో వినోద్ ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషించారని ఆరోపించారు. వినోద్ ఫిర్యాదు మేరకు ఇసామియా బజార్లో నివసిస్తున్న బాలాజీ, ప్రమీల దంపతులతో పాటు వారి కుమారులు ఉదయ్ సాగర్, అతడి భార్య సంధ్య, అభిషేక్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. వినోద్ తాను ఉంటున్న 70 గజాల ఇంటిని కొనుగోలు చేసేందుకు యజమానితో 4 నెలల కిందట ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలోనే యజమానికి రూ.10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. తర్వాత ఇంటిని అమ్మబోనని చెప్పిన యజమాని తానిచ్చిన అడ్వాన్స్ తిరిగివ్వకుండా వేధిస్తున్నాడు. దీనిపై నిలదీయడానికి వెళ్లిన వినోద్‌పై యజమాని కుటుంబం దాడికి పాల్పడింది. వినోద్ తీవ్రగాయాలతోనే కాచిగూడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తనపై హత్యయత్నం చేయడంతో పాటు కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
By July 23, 2019 at 09:11AM
No comments