Breaking News

టిక్‌టాక్ మోజులో విశాఖ ‘శక్తి టీమ్’ పోలీసులు... ఉన్నతాధికారుల సీరియస్


యాప్.. సినిమా డైలాగులకు, పాటలకు పేరడీలు చేసుకుని టైమ్‌‌పాస్ కలిగించే సోషల్‌మీడియా యాప్. దీనిలో మరో కోణం ఉంది. ఎందరో యువకుల ప్రాణాలు పోవడానికి, ఎందరో ఉద్యోగుల జీవితాలు రోడ్డు మీద పడటానికి కూడా ఇదే కారణమవుతోంది. తెలంగాణలోని ఖమ్మం కార్పోరేషన్ ఉద్యోగులు, గాంధీ ఆస్పత్రిలో పిజియోథెరపీ స్టూడెంట్స్ టిక్‌టాక్ చేసి చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు టిక్‌టాక్ వీడియోలు తీస్తూ కాలక్షేపం చేస్తే కఠినచర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. గుజరాత్‌లో అర్పితా అనే పోలీసు కూడా బాలీవుడ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసి సస్పెన్షన్‌కు గురైంది. Also Read: ఇప్పుడు టిక్‌టాక్ పైత్యం ఏపీ పోలీసులకు చేరింది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ‘శక్తి టీమ్స్’ పేరుతో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటుచేసింది. ప్రజల రక్షణ కల్పించాల్సిన శక్తి టీమ్ పోలీసులు విధులు మానేసి టిక్‌టాక్ మోజులో పడ్డారు. యూనిఫామ్‌లో ఉండగానే ప్రభుత్వ వాహనంలోనే జబర్దస్త్ డైలాగులకు, సినిమా పాటలకు పేరడీలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రజలు మండిపడుతున్నారు. Also Read: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు విధులు మానేసి టిక్‌టాక్ వీడియోలు తీసుకోవడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించేవారిని ఉపేక్షించేది లేదని చెబుతున్నారు. ఏదిఏమైనా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వెలుగుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల టిక్‌టాక్‌ వీడియోలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. Also Read:


By July 27, 2019 at 10:42AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/vizag-shakti-team-doing-tiktok-videos-on-duty-higher-officials-is-serious/articleshow/70406111.cms

No comments