Breaking News

హోంగార్డుపై వైసీపీ నేత బూతు పురాణం.. ఇదిగో ఆడియో టేప్


వైఎస్ఆర్‌సీపీ నేత, ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు కుమారుడు నుంచి తనకు ప్రాణహాని ఉందని హోంగార్డ్ ఎస్.రవికుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. రాజేంద్ర తనకు ఫోన్ చేసి కాళ్లు, చేతులు నరికేస్తానంటూ బెదిరించాడని హోంగార్డ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈపురుపాలెం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తోన్న హోంగార్డ్ రవికుమార్ అదే స్టేషన్‌లో రాజేంద్ర ఫిర్యాదు చేశారు. రాజేంద్ర అసభ్యకరమైన పదజాలంతో తనను, తన పైఅధికారులను, పోలీస్‌ వ్యవస్థను అత్యంత నీచాతి నీచంగా, అవమానకరంగా బూతులు తిట్టారని రాజేంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఆమంచి రాజేంద్ర, అతని కుటుంబ సభ్యులు, బంధువుల నుండి ప్రాణహాని ఉందని.. వారి నుంచి తనను రక్షించాలని కోరారు. రాజేంద్ర తనకు ఫోన్ చేసి బూతులు తిట్టిన వాయిస్ రికార్డింగ్‌ను కూడా పోలీసులకు రవికుమార్ అందజేశారు. ఈ ఆడియో టేప్ ఇప్పుడు బయటికి వచ్చింది. Also Read: ఈ ఆడియో టేప్‌లో హోంగార్డ్‌ను రాజేంద్ర బూతులు తిడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వార్తలో రాయలేని బూతులు ఈ ఆడియో టేప్‌లో ఉన్నాయి. తనను ఎవరి దగ్గరో ఏదో అన్నారనే కోపంతో హోంగార్డ్‌కు ఫోన్ చేసిన రాజేంద్ర.. నువ్వెంత, నీ బతుకెంత అంటూ భరించలేని బూతులు తిట్టారు.


By July 11, 2019 at 10:42AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ysrcp-leader-amanchi-krishna-mohans-nephew-accused-of-threatening-home-guard/articleshow/70168785.cms

No comments