కీచక వైద్యుడు.. అండగా ఉంటానని నమ్మించి నర్సుపై లైంగిక దాడి
పెళ్లయి పిల్లలున్న నర్సును నమ్మించి లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడిన డాక్టర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు అండగా ఉంటానని నమ్మించి డాక్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితురాలికి వివాహమై పిల్లలున్నారు. భర్త సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో ఆ మహిళ ఇష్టపూర్వకంగానే డాక్టర్‌తో వివాహేతర సంబంధం కొనసాగించిందా? అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. పాతబస్తీ అల్‌జుబైల్ కాలనీకి చెందిన ఓ మహిళకు పెళ్లయి పిల్లలున్నారు. ఆమె భర్త ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. నర్సింగ్ కోర్సు చదివిని మహిళ ఇంజన్‌బౌలిలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అక్కడికి చాంద్రాయణగుట్ట హాషామాబాద్‌కు చెందిన ఎం.ఎ.అలీమ్ మోహియుద్దీన్ వైద్యుడిగా వచ్చాడు. ఆ మహిళ అలీమ్ వద్దే నర్సుగా పనిచేయడంతో ఇద్దరికి సాన్నిహిత్యం పెరిగింది. తన భర్త సౌదీ ఉంటాడని మహిళ చెప్పడంతో డాక్టర్ దాన్ని అలుసుగా తీసుకున్నాడు. భర్త వచ్చేవరకు తాను అండగా ఉంటానని ఆమెను నమ్మించి లొంగదీసుకున్నాడు. ఆమెను లైంగికంగా దోచుకున్నాడు. డాక్టర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన మహిళ తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. అలీమ్ తనను మోసగించి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో అలీమ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని బుధవారం రియాజ్‌ను అరెస్ట్ చేశారు. అయితే మహిళ చెప్పిన కోణంలో పోలీసులకు అనేక అనుమానాలు వస్తున్నాయి. భర్త ఉండి కూడా అండగా ఉంటానని డాక్టర్ చెబితే మహిళ ఎలా నమ్మిందన్న కోణంలోనూ విచారిస్తున్నారు.
By July 25, 2019 at 10:07AM
No comments