Breaking News

ఓఆర్ఆర్‌పై తుపాకీతో కాల్చుకున్న యువకుడు మృతి


ఔటర్ రింగ్ రోడ్‌పై గురువారం మధ్యాహ్న సమయంలో తుపాకీతో తనను తాను కాల్చుకున్న ఫైజల్ అనే యువకుడు శుక్రవారం మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద గురువారం (జులై 4) మధ్యాహ్నం రెండ్ కలర్ బెంజ్ కారులో ప్రయాణిస్తూ తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ ఘటనతో బెంబేలెత్తిన ప్రయాణికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఫైజల్‌ను గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. నిన్నటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఫైజల్ పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం మృతిచెందాడు. మాసాబ్‌ట్యాంక్‌లో నివసించే అతడు నగరంలో యూఎస్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడని, వ్యాపారంలో కోట్లలో నష్టం రావడంతో కుంగిపోయి ఆత్మహత్యకు యత్నించాడని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఫైజల్ ఆత్మహత్యకు యత్నించిన బెంజ్ కారును ఎస్ఎం జైన్ కారు డీలర్ వద్ద నెలకు రూ.2లక్షల అద్దె చొప్పున తీసుకున్నాడని వెల్లడించారు.


By July 05, 2019 at 12:06PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/injured-with-gun-fired-man-in-hyderabad-orr-died-friday/articleshow/70086138.cms

No comments