Breaking News

జైపాల్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం.. 4సార్లు ఎమ్మెల్యే, 5సార్లు ఎంపీ


రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరున్న కేంద్ర మాజీ మంత్రి మృతిపట్ల రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయిన జైపాల్‌కు అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలున్నాయి. మంచివక్త అయిన జైపాల్‌రెడ్డి పార్లమెంటులో మాట్లాడితే ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా ఆసక్తిగా వినేవారు. అందుకే ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికయ్యారు. 1969లో తరపున తొలిసారి మహబూబ్‌నగర్ కల్వకుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందిన జైపాల్‌రెడ్డి అక్కడి నుంచి మొత్తం నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 1977లో జనతాపార్టీలో చేరారు. 1980లో ఇందిరాగాంధీపై పోటీచేసి ఓడిపోయారు. 1984లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందిన జైపాల్‌రెడ్డి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఐకే గుజ్రాల్ కేబినెట్లో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా, మన్మోహన్‌సింగ్ మంత్రివర్గంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్నారు.


By July 28, 2019 at 08:11AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/jaipal-reddy-worked-in-ik-gujral-and-manmohan-singhs-cabinet/articleshow/70416085.cms

No comments