Breaking News

కర్ణాటకీయంలో భారీ ట్విస్ట్.. 14మంది రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు


కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్షకు ఒక్కరోజు ముందు స్పీకర్ రమేష్‌కుమార్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ ఆదివారం ప్రకటన జారీచేశారు. రెబెల్స్‌పై నాలుగేళ్ల పాటు నిషేధం కొనసాగుతుందని, వారిని సభలోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పీకర్ స్పష్టం చేశారు. గతంలో అనర్హత వేటు పడిన ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి మొత్తం 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేశారు. అనర్హత వేటు పడిన వారిలో కాంగ్రెస్ పార్టీ నుంచి మునిరత్నం, సోమశేఖర్, బస్వరాజు, రోషన్‌బేగ్, ఆనంద్‌సింగ్, నాగరాజు, బీసీ పాటిల్, ప్రతాప్ గౌడ, జేడీఎస్ నుంచి గోపాలయ్య, నారాయణగౌడ, విశ్వనాథ్, ఇండిపెండెంట్ అభ్యర్థి శంకర్ ఉన్నారు. ప్రభుత్వం మారడంతో స్పీకర్ రమేష్‌కుమార్‌ను తప్పించాలని బీజేపీ యోచిస్తోంది. ఆయన గౌరవంగా తప్పుకోకపోతే.. తామే తప్పించాలని తాజా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప సర్కారుకు దిమ్మదిరిగే షాకిచ్చారు స్పీకర్. స్పీకర్ తాజా నిర్ణయంతో కర్ణాటక విధానసభలో సభ్యుల సంఖ్య 207కి చేరింది.


By July 28, 2019 at 12:23PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/14-karnataka-rebel-mlas-disqualified-speaker-ramesh-kumar-announce/articleshow/70417835.cms

No comments