Breaking News

మూగ యువతిపై అత్యాచారం.. కామాంధుడికి 10ఏళ్ల జైలు


మూగ యువతిపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. జిల్లా దౌల్తాబాద్ మండలంలోని ఓ గ్రామంలో మూగ యువతిపై 2013, మార్చి 17వ తేదీన కల్లు దుకాణం నిర్వహించే మహేశ్‌గౌడ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై అప్పటి కొడంగల్‌ సీఐ విజయ్‌లాలా నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ కేసులో 12 మంది సాక్షులకు విచారించిన కోర్టు మహేష్‌గౌడ్‌ను దోషిగా తేల్చింది. దీంతో శుక్రవారం మహబూబ్‌నగర్ మొదటి అదనపు సెషన్స్ జడ్జి రఘురాం మహేష్‌గౌడ్‌కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కోర్టు తీర్పుపై బాధితురాలి బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూగ, బధిరురాలు అని కూడా చూడకుండా యువతిపై అత్యాచారానికి పాల్పడిన మహేష్‌గౌడ్‌కు తగిన శిక్ష పడిందని గ్రామస్థులు అంటున్నారు. అయితే ఈ కేసులో ఏడేళ్లకు నిందితుడికి శిక్ష పడటంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


By July 13, 2019 at 12:18PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-gets-10-year-jail-for-raping-deaf-young-woman-in-mahabubnagar/articleshow/70202649.cms

No comments