Breaking News

ప్రపంచంలో ఆ ఘనత ఒక్క విజయనిర్మలకే సాధ్యం


అలనాటి నటి, ప్రముఖ దర్శకురాలు మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్‌కు గురిచేసింది. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతికి గురయ్యారు. 1946, ఫిబ్రవరి 20న తమిళనాడులో జన్మించిన విజయనిర్మల ఏడో ఏటనే తమిళ సినిమా ‘మత్స్యరేఖ’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. 11 ఏళ్ల ప్రాయంలో ‘పాండురంగ మహత్యం’ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. సూపర్ స్టార్ కృష్ణతోనే ఏకంగా 47 సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఎన్నో బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు తెరకెక్కించేందుకు ప్రముఖ దర్శకులు, నిర్మాణ సంస్థలు పోటీ పడేవి. కేవలం నటిగానే కాకుండా దర్శకత్వం, నిర్మాణ రంగాల్లోనూ విజయనిర్మల రాణించారు. 1971లో ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన విజయనిర్మల మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి వంటి చిత్రాలు తెరకెక్కించారు. దర్శకురాలుగా 44 చిత్రాలను తెరకెక్కించిన ఆమె ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. ప్రపంచంలో ఏ మహిళా దర్శకురాలికి ఈ ఘనత దక్కకపోవడం తెలుగువారు గర్వించదగ్గ విషయం. ఇంతటి ఘనత సాధించిన దిగ్గజ దర్శకురాలు నేడు ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో


By June 27, 2019 at 08:48AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vijaya-nirmala-entered-the-guinness-book-of-world-record/articleshow/69967646.cms

No comments