Breaking News

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’ వస్తున్నాడు


సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’.. జూన్ 21న విడుద‌ల‌

న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యుబైఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రాన్ని జూన్ 21న విడుద‌ల చేస్తున్నారు. స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన స్పంద‌న ల‌భించింది. న‌వీన్ ఈచిత్రంలో డిటెక్టివ్ పాత్ర‌ధారిగా న‌టించారు. సినిమా ఆసాంతం ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. మార్క్ కె. రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందించారు. డిఫ‌రెంట్ టేకింగ్‌, స్క్రీన్‌ప్లేతో సాగే కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఇది. మ‌ళ్ళీరావా చిత్రాన్ని అందించిన రాహుల్ యాద‌వ్ న‌క్కా ఈ చిత్రాన్ని స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. 

న‌టీన‌టులు: న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె

నిర్మాత‌: రాహుల్ యాద‌వ్ న‌క్కా

బ్యాన‌ర్‌: స‌్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

మ్యూజిక్‌: మార్క్ కె.రాబిన్‌(అ! ఫేమ్‌!

కెమెరా: స‌న్నీ కూర‌పాటి

సౌండ్‌: నాగార్జున్ తాళ్ల‌ప‌ల్లి(కేరాఫ్ కంచ‌రపాలెం ఫేమ్‌)

ఆర్ట్‌: క్రాంతి ప్రియం

పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌



By June 03, 2019 at 06:34AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/46181/agent-sai-srinivasa-athreya.html

No comments