Breaking News

‘నాన్న బీజేపీలోకి వెళ్లినా నేను టీడీపీలోనే ఉంటా’


రెండు రోజుల కిందట టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. వీరిలో కర్నూలు జిల్లాకు చెందిన కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీజీ తనయుడు భరత్ స్పందించారు. తన తండ్రి బీజేపీలో చేరినా తాను మాత్రం టీడీపీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం నుంచి పోటీచేసి దాదాపు 4 వేల ఓట్ల తేడాతో ఓటమి చూవిచూశారు. టీజీ వెంకటేశ్ బీజేపీలో చేరడంతో భరత్ కూడా తండ్రి బాటలో సాగుతారని భావించారు. కానీ, తాను మాత్రం టీడీపీని వీడేదిలేదని ఆయన ఉద్ఘాటించారు. ఇదే విషయాన్ని నారా లోకేశ్‌కు సైతం ఫోన్‌లో చెప్పినట్టు భరత్ వెల్లడించారు. బీజేపీలో చేరడానికి ముందు తన తండ్రి వెంకటేశ్ తనకు ఫోన్‌చేసి పార్టీ మారుతున్న విషయం చెప్పారని అన్నారు. ఆయన బీజేపీలో చేరుతున్నా తాను ఎక్కడ ఉండాలన్నది తన ఇష్టమని చెప్పినట్టు భరత్ పేర్కొన్నారు. అంతేకాదు, ఆయన బీజేపీలో చేరిన వెంటనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు ఫోన్ చేసి మాట్లాడానని అన్నారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని లోకేశ్‌కు చెప్పానని వివరించారు. ఎంతో ఒత్తిడి ఉన్నా తనపై నమ్మకంతో అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే చంద్రబాబు, లోకేశ్‌లను తాను కలుస్తానని భరత్ తెలిపారు. కాగా, రాష్ట్ర విభజన తర్వాత టీజీ వెంకటేశ్ కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అనంతరం రాజ్యసభ సభ్యుడిగా చంద్రబాబు అవకాశం కల్పించారు. తన రాజకీయ వారసుడిగా టీజీ భరత్‌ అరంగేట్రం చేశారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎస్వీ మోహన్‌రెడ్డికే 2019 ఎన్నికల్లో టిక్కెట్ దాదాపు ఖరారయ్యింది. అయితే, చివరి నిమిషంలో చక్రం తిప్పిన టీజీ తన తనయుడికి టిక్కెట్ ఇప్పించుకున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో భరత్ స్వల్ప తేడాతో ఓడిపోయారు.


By June 22, 2019 at 11:12AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/mp-tg-venkatesh-son-bharat-says-will-continue-in-tdp/articleshow/69900885.cms

No comments