Breaking News

మరీ ఇంత కన్నింగా.. మంచు విష్ణు!


‘ఓటరు’ సినిమా విషయంలో నన్ను మంచు విష్ణు బెదిరిస్తున్నాడంటున్నాడు ఆ చిత్ర దర్శకుడు జి. కార్తీక్ రెడ్డి. గత రెండు మూడు రోజులుగా టాలీవుడ్‌లో సంచలనంగా మారిన ‘ఓటరు’ సినిమా వివాదం ఇప్పుడు ‘ఫణి’ తుపాన్‌లా తీవ్రరూపం దాల్చబోతోంది. ఇప్పటికే ‘ఓటరు’ చిత్ర దర్శకుడికి, నిర్మాతకు నోటిసులు పంపిన మంచు విష్ణు.. అసెంబ్లీ రౌడీని అడ్డుపెట్టుకుని పెద్ద స్కెచ్చే నడిపినట్లుగా దర్శకుడు జి. కార్తీక్ రెడ్డి చెబుతుంది వింటే తెలుస్తోంది.

తను రాసుకున్న ‘పవర్‌ఫుల్‌’ అనే కథను డెవలప్‌ చేసి ‘ఓటర్‌’ అనే టైటిల్‌తో మంచు విష్ణుతో సినిమా తీశానని, ఈ కథ నా సొంతం అని, దీనిని తెలుగు సినీ రచయితల సంఘంలో రిజిస్టర్‌ కూడా చేయించాననీ కార్తీక్‌రెడ్డి చెబుతున్నాడు. అయితే షూటింగ్‌ జరుగుతుండగా విష్ణు బలవంతం చేయడంతో రెండు సీన్లు మార్చాల్సి వచ్చిందనీ, అలాగే తనకు స్వేచ్ఛ ఇవ్వకుండా ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకొంటూ సినిమా బడ్జెట్‌ను పెంచారనీ ఆరోపిస్తున్నాడు. తనకు తెలియకుండా ‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగ్‌లో ఓటరు చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్లు అక్కడే విష్ణు షూట్ చేయించాడని తెలుపుతున్నాడు. సినిమా షూటింగ్‌ అయిపోయిన తర్వాత రష్‌ చూసుకొని కథకు మంచి పేరు వస్తుందని నమ్మకం కుదిరిన తర్వాత టైటిల్స్‌లో కథ, స్కీన్‌ప్లే క్రెడిట్స్‌ తనకు ఇవ్వాలని బెదిరించినట్లుగానూ, విడుదలకు సమస్య రాకుండా చేస్తానని ఓ తప్పుడు అగ్రిమెంట్‌పై తనతో సంతకం చేయించుకున్నట్లుగానూ, ఇందులో విజయ్ కుమార్ రెడ్డి అనే అతని ప్రమేయం కూడా ఉన్నట్లుగా కార్తీక్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. నిర్మాత జాన్ సుధీర్ కూడా ఇదే విషయం చెబుతూ ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశాడు.

సో.. ఇదంతా విన్న వారంతా మంచు విష్ణు ఇంత కన్నింగ్ ఫెలోనా అని అనుకుంటుండటం విశేషం. ఇంకో విషయం ఏమిటంటే దర్శకుడు కార్తీక్ రెడ్డి చెబుతున్న ప్రతి విషయం మోహన్ బాబుకు కూడా తెలుసంట. నేను సర్దిచెబుతాను అని ఎన్నోసార్లు మోహన్ బాబు కూడా కార్తీక్‌కు భరోసా ఇచ్చాడట. కానీ మోహన్ బాబు మాట కూడా లెక్క చేయకుండా విష్ణు ప్రవర్తించాడని, తనకు తగిన న్యాయం జరిపించాలని దర్శకుడు కార్తీక్ రెడ్డి వేడుకుంటున్నాడు. మరి ఈ విషయం తేలాలంటే మాత్రం ఖచ్చితంగా టాలీవుడ్ పెద్దలు కలుగజేసుకోవాల్సిందే అనే మాటలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.



By May 04, 2019 at 11:36AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45796/karthik-reddy.html

No comments