Breaking News

గురుశిష్యులలో ఎవరు మెప్పిస్తారో చూడాలి!


టాలీవుడ్‌లో వచ్చిన కల్ట్‌ మూవీగా, మోడ్రన్‌ క్లాసిక్‌గా సంచలనం సృష్టించిన చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. ఇలాంటి చిత్రాలను తీయడంలో ఆద్యుడు బాలా. కానీ తెలుగులో వచ్చిన ఈ రీమేక్‌ని తీయడంలో మాత్రం ఆయన విఫలం చెందాడని, అందుకే ఈ రీమేక్‌ని తమిళంలో చియాన్‌ విక్రమ్‌ తనయుడు దృవ్‌ని తెరంగేట్రం చేస్తూ తీసిన ‘వర్మ’ ఏమాత్రం బాగా లేక నాసిరకంగా ఉందని చెప్పి, ఈ మొత్తం సినిమాని పక్కనపెట్టడం పెద్ద సంచలనాలకే కారణమైంది. అయినా విక్రమ్‌ మీద ఉన్న గౌరవంతో బాలా ఈ విషయంలో పల్లెత్తు మాట కూడా బయటకు చెప్పలేదు. ఆ తర్వాత ఇదే చిత్రాన్ని ‘ఆదిత్యవర్మ’ పేరుతో తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’కి దర్శకునిగా పనిచేసి సందీప్‌రెడ్డి వంగా అసిస్టెంట్‌ గిరీశయ్యతో తీశారు. ఇందులో దృవ్‌ని తప్ప అందరినీ మరలా రీప్లేస్‌ చేశారు. 

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం డెహ్రాడూన్‌ షెడ్యూల్‌ తప్ప మిగిలిన షూటింగ్‌ పార్ట్‌ మొత్తం పూర్తయింది. త్వరలో టీజర్‌తో పాటు రిలీజ్‌డేట్‌ని కూడా ప్రకటించనున్నారు. ఇదే సమయంలో ఏకంగా సందీప్‌రెడ్డి వంగానే ఈ రీమేక్‌ని బాలీవుడ్‌లో షాహిద్‌ కపూర్‌, కియారా అద్వానీలతో ‘కబీర్‌సింగ్‌’గా తీశాడు. ఈ చిత్రం కూడా పూర్తయి జూన్‌ 21న విడుదల కానుంది. ఎలా చూసుకున్నా హిందీ ‘కబీర్‌సింగ్‌’ విడుదలకు తమిళ ‘ఆదిత్యవర్మ’ రిలీజ్‌కి పెద్దగా గ్యాప్‌ ఉండకపోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు భాషల్లోని చిత్రాలను తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’తో పోలిక రావడం ఖాయం. 

బాలీవుడ్‌ రీమేక్‌ కబీర్‌సింగ్‌లో మాత్రం నేపధ్యం ఢిల్లీ కావడంతో దానికి తగ్గట్లుగా సందీప్‌ పలు మార్పులు చేర్పులు చేశాడనేది సుస్పష్టం. తమిళంలో మాత్రం గిరీశయ్య ఒరిజినల్‌ ఫీల్‌ చెడకుండా, దాదాపు తెలుగు అర్జున్‌రెడ్డికి పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా యాజిటీజ్‌గా తీశాడని తెలుస్తోంది. ఈ రెండు చిత్రాల విడుదల కోసం ఆయా భాషల వారే కాదు.. తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ రీమేక్‌ని గురువు సందీప్‌రెడ్డి వంగా బాగా తీశాడా? లేక శిష్యుడు గిరీశయ్య బాగా తీశాడా? అనే విషయంలో పోలికలు రావడం ఖాయం. మరి ఈ రెండింటిలో ఏది పెద్ద హిట్‌గా నిలిచి ప్రశంసలు అందుకుంటుందో వేచిచూడాల్సివుంది....! 



By May 21, 2019 at 04:59AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/46013/arjun-reddy.html

No comments