Breaking News

తమన్నా- ప్రభుదేవాల రేర్ రికార్డ్..!


కొరియోగ్రాఫర్‌గా, స్పెషల్‌సాంగ్స్‌ స్పెషలిస్ట్‌గానే కాకుండా ఇండియన్‌ మైఖేల్‌జాక్సన్‌ ప్రభుదేవాకి నటునిగా, దర్శకునిగా కూడా మంచి పేరుంది. ‘జెంటిల్‌మేన్‌’లో ఆయన చేసిన ‘చుకుబుకు చుకుబుకు రైలే’ పాట ఎంతగా సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇక ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శంకర్‌దాదా జిందాబాద్‌’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ఆ తదుపరి కొన్ని కోలీవుడ్‌ చిత్రాలకు దర్శకత్వం వహించి తర్వాత బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటాడు. అయితే ఆయన బాలీవుడ్‌లో తీసిన చిత్రాలు దాదాపు అన్ని దక్షిణాది చిత్రాల రీమేక్‌లు కావడంతో ఆయనకు రీమేక్‌ డైరెక్టర్‌గా పేరు వచ్చింది. 

ఇటీవల ఆయన తమన్నాతో కలిసి ‘అభినేత్రి’ చిత్రంలో నటించాడు. ప్రస్తుతం మరలా తమన్నాతోనే ప్రభుదేవా ‘అభినేత్రి 2’లో నటించాడు. దీనికి ‘దేవి 2’ అనే టైటిల్‌ని పెట్టారు. దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ చిత్రం విడుదల ఖారారైంది. మరో ముఖ్యవిశేషం ఏమిటంటే, బాలీవుడ్‌లో తమన్నా-ప్రభుదేవాలు కలిసి మరో హర్రర్‌ చిత్రంలో నటించారు. ఈ చిత్రం పేరు ‘ఖామోషీ’. కమల్‌హాసన్‌ నటించిన ‘సాగరసంగమం’లో భంగిమ అంటూ ఫొటోలు తీసే చక్రి తోలేటి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఈయన కమల్‌హాసన్‌, వెంకటేష్‌లతో కలిసి ‘ఈనాడు’ చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా మే 31నే విడుదల కానుంది. ఇలా ఈ రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల కానుండటం విశేషం. 

ఒక హీరో, ఒక హీరోయిన్‌ కలిసి నటించిన ఒకే జోనర్‌ అయిన రెండు హర్రర్‌ చిత్రాలు ఒకేరోజున విడుదల కావడం అంటే ఎంతో అరుదనే చెప్పాలి. దీన్ని తమన్నా-ప్రభుదేవాలు నిజం చేస్తున్నారు. మరి ఈ రెండు హర్రర్‌ కామెడీ చిత్రాలలో ఏది ఎక్కువ విజయం సాధిస్తుంది? ప్రేక్షకులను మెప్పిస్తుంది? అనేది వేచిచూడాలి. ఇటీవల హర్రర్‌ కామెడీ చిత్రాల హవా తగ్గింది అనుకుంటున్న సమయంలో మరలా రాఘవలారెన్స్‌ ‘కాంచన 3’తో మంచి విజయం సాధించడం వల్ల ఈ రెండు చిత్రాలపై ఆసక్తి నెలకొని ఉంది.



By May 22, 2019 at 05:59AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/46032/tamanna.html

No comments