Breaking News

ఆగిపోలేదని కాజల్ క్లారిటీ ఇచ్చేసింది!


సీత మూవీ ప్రమోషన్స్‌లో కాజల్ అగర్వాల్ కేవలం సీత గురించి మాత్రమే కాదు.. ఇంకా చాలా విషయాలు మీడియాతో పంచుకుంది. సీత సినిమా కోసం తానెంత శ్రమించానో చెబుతున్న కాజల్ ని మీడియా మిత్రులు కాజల్ నటించబోయే భారతీయుడు 2 సినిమా విషయాలు అడగగా.. దానికి కాజల్ అగర్వాల్ కూడా తాను కూడా ఆ సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందా అని వెయిట్ చేస్తున్నానని... భారతీయుడు 2 ఆగిపోయింది అని జరిగే ప్రచారంలో నిజం లేదని చెబుతుంది. భాతీయుడు 2 సినిమా ఖచ్చితంగా ఉంటుందని చెబుతుంది కాజల్.

కమల్ హాసన్ వలన భారతీయుడు 2 షూటింగ్ ఆగిపోయింది, నిర్మాతలు వలన సినిమా షూటింగ్ కి బ్రేక్ వచ్చింది అనే దానిలో నిజం లేదని.... కమల్ సర్ రాజకీయాలలో బిజీగా ఉండడం వలనే భారతీయుడు 2 సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారని.. మళ్ళీ జూన్ నుండి భారతీయుడు 2 సెట్స్ మీదకెళుతుందని.. ఎప్పుడెప్పుడు భారతీయుడు 2 షూటింగ్ లో పాల్గొంటానా అనే క్యూరియాసిటీతో ఉన్నానని చెబుతుంది. మరి నిజంగానే కాజల్ అగర్వాల్ చెప్పినట్లుగా భారతీయుడు 2 మళ్ళీ మొదలైతే అటు శంకర్ ఇటు నిర్మాతలు అలాగే కమల్ హాసన్ అభిమానులు అందరూ ఆల్ హ్యాపీస్. 



By May 22, 2019 at 03:36AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/46029/kajal-agarwal.html

No comments