Breaking News

పవర్ఫుల్ టైటిల్‌తో రామదూత ఆర్ట్స్‌ రెండో చిత్రం


రామదూత ఆర్ట్స్‌ జి. సీతారెడ్డి నిర్మాణంలో రెండవ చిత్రం ‘మేజర్ చక్రధర్’

సంహిత, చిన్ని-చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మించిన రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఎంతవారలైనా’. అద్వైత్‌, జహీదా శ్యామ్‌, అలోక్‌ జైన్‌, జి.సీతారెడ్డి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం సమ్మర్‌ కానుకగా మే 17న అత్యంత గ్రాండ్‌గా రిలీజై పాజిటివ్ టాక్‌తో  సక్సెస్ ఫుల్‌గా  ప్రదర్శింపబడుతోంది. ఈసందర్భంగా మే 20(సోమవారం)న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..

నిర్మాత, నటుడు జి. సీతారెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా రామదూత ఆర్ట్స్ బ్యానర్‌ఫై నిర్మించిన మొదటి మూవీ ‘ఎంతవారలైనా’. ఈ చిత్రం మే 17న గ్రాండ్‌గా విడుదలయింది. విడుదలైన అన్ని సెంటర్స్‌లో మంచి టాక్ తెచ్చుకొని అద్భుతంగా ప్రదర్శింపబడుతోంది. మా మొదటి సినిమాకే అన్ని వర్గాల ప్రేక్షకులనుండి మంచి ఆదరణ లభిస్తోంది. మా సినిమాకు మీడియా నుండి కూడా మంచి సపోర్ట్ లభించింది. అందుకు మీడియా వారికి ధన్యవాదాలు. నాకు నిర్మాతగానే కాకుండా నటుడిగా కూడా మంచి గుర్తింపు లభించింది. నా ఫ్రెండ్స్, మా బంధువులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. అలాగే ఇండస్ట్రీ నుండి కూడా మంచి అప్లాజ్ వస్తోంది. ఎంతవారలైనా సినిమా విజయం ఇచ్చిన ఉత్సహంతో మా ప్రొడక్షన్‌లో రెండవ మూవీ ‘మేజర్ చక్రధర్’ను అనౌన్స్ చేస్తున్నాను. ఒక మేజర్ ఈ సమాజంలో ఉన్న సమస్యలపై ఎలా స్పందించాడు అన్న పవర్ఫుల్ పాయింట్‌తో ఈ సినిమా మీ ముందుకు వస్తోంది. దర్శకుడి విజన్ చాలా బాగుంది. స్టోరీ అద్భుతంగా నరేట్ చేశారు. స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలో సెట్స్ మీదకు వెళ్తాము. మిగతా ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ గురించి త్వరలోనే తెలియజేస్తాము. కథే హీరోగా మా బ్యానర్‌లో రాబోయే ప్రతి చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే నటుడిగా నాకు తెలుగు, కన్నడ ఇండస్ట్రీ నుండి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. దీనంతటికి కారణం అయిన మీడియాకు కృతజ్ఞతలు. త్వరలోనే ఎంతవారలైనా విజయోత్సాహాన్ని మీతో పంచుకుంటాను’’ అన్నారు.



By May 21, 2019 at 11:36AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/46018/ramadootha-arts.html

No comments