Breaking News

ఏ హీరోది నచ్చలా.. నా భర్తే బాగా పెడతాడు


ఒకప్పుడు సన్నీలియోన్ పేరు చెబితే.. ఆమెను ఓ పోర్న్ భామగానే చూసేవారు. కానీ ఇప్పుడు ఆమె నడుచుకుంటున్న తీరు అందరికీ స్ఫూర్తిగా నిలస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పిల్లల(ముగ్గురు అనాథలను దత్తత తీసుకుంది) విషయంలో ఆమె వెళ్లిన దారి అందరినీ ఆలోచించేదిగా చేసింది. కొందరు ఆమెను ఇంకా పోర్న్ స్టార్‌గానే చూస్తున్నా.. బాలీవుడ్ సినిమాలతో, భర్త, పిల్లలతో లైఫ్‌ను చక్కగా ఎంజాయ్ చేస్తోంది సన్నీలియోన్.

పోర్న్ స్టార్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చేందుకు ఆమె చేసిన కృషి నిజంగా అభినందనీయం. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలలో హీరోయిన్‌గా, తను ప్రేమించి పెళ్లాడిన డేనియేల్‌ వెబర్‌కు భార్యగా, తన పిల్లలకు తల్లిగా కర్తవ్యం నిర్వహిస్తుంది సన్నీలియోన్. ఇక షూటింగ్ లేని సమయాలలో భర్త, పిల్లలతో విహారయాత్రలకు వెళ్తూ, అక్కడి ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక సన్నీలియోన్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఇతర హీరోలతో తన భర్తను పోలుస్తూ.. తన భర్త ఎంత గొప్పవాడో తెలిపింది.

‘‘డేనియల్‌ వెబర్ నాకు భర్తగా దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన నన్ను ఇంట్లో ‘బూబ్ల’ అంటారు. ఆయనే నా ప్రపంచం. ఆయన నా పక్కన లేకుండా అస్సలు నన్ను నేను ఊహించుకోలేను’’ అని భర్త గురించి గొప్పగా చెప్పిన సన్నీ.. ‘ఇప్పటి వరకూ నటించిన సినిమాలలో ఏ హీరోతో లిప్‌లాక్‌ కంఫర్ట్‌గా ఉంది’ అనే ప్రశ్నకు మాత్రం ఆసక్తికరమైన సమాధానాన్ని తెలిపింది. ‘‘చాలా సినిమాల్లో లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించా. కానీ నా భర్త వెబర్‌లాగా ఎవరూ కిస్‌ చేయలేరు. ఆ మజానే వేరుగా ఉంటుంది’’ అని కుండబద్దలు కొట్టేసింది సన్నీ.



By May 05, 2019 at 12:40PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45810/sunny-leone.html

No comments