Breaking News

బాబు మహర్షి.. ఇంకో వారం దున్నుకో..!


మహేష్ మహర్షి సినిమా గత గురువారం విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బెటర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది . మహేష్ కెరీర్ లో 25 వ సినిమాగా తెరకెక్కిన మహర్షి సినిమా అందరూ ఎక్సపెక్ట్ చేసినా హిట్ అయితే అవలేదు. వంశి పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు మరో ఇద్దరు నిర్మాతలు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన మహర్షి సినిమాకి వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే.... బడ్జెట్ కి సరిపడా కలెక్షన్స్ రావొచ్చు అని అంటున్నారు. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కి చేరినా.. మరికొన్ని చోట్ల మహర్షికి నష్టాలూ తప్పేలా కనబడ్డం లేదు. అందులో ముఖ్యంగా సీడెడ్, ఓవర్సీస్ బయ్యర్లకు మహర్షితో ఎంతో కొంత నష్టాలూ మిగిలేలా కనబడుతుంది. మరి మహేష్ ఎన్నడూ లేని విధంగా వంశి పైడిపల్లి నిర్మాతలతో కలిసి సినిమాని తెగ ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాడు. మరి నేడు మహర్షి విజయోత్సవ సభ అంటూ హడావిడి కూడా మొదలైంది. 

అయితే మహర్షి సినిమా మొదటి వారానికే చుట్టేయాల్సి వస్తుందేమో... అల్లు హీరో శిరీష్ ఎబిసిడి సినిమాకి పాజిటివ్ టాక్ పడితే అని అనుకున్నారు కానీ.. అల్లు శిరీష్ నటించిన ఎబిసిడి సినిమాకి యావరేజ్ టాక్ కూడా రాకపోయేసరికి ప్రేక్షకులకు మరో వారం పాటు మహర్షి సినిమా తప్ప మరో దిక్కు లేదు. మళ్ళీ బెల్లంకొండ శ్రీనివాస్ - కాజల్ అగర్వాల్ ల సీత సినిమా బాక్సాఫీసు వద్దకు వచ్చేవరకు మహర్షి సినిమాదే హవా... మరి మహర్షి సినిమాకి మరో వారం కలిసొచ్చినట్లే అనిపిస్తుంది. మహేష్ బాబు మహర్షి సినిమాతో సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టినట్లుగా ఫీల్ అవుతున్నాడు. మరి మరో వారం దున్నేసుకో మహర్షి అంటూ సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు రెచ్చిపోతూ పోస్ట్ లు పెడుతున్నారు.



By May 19, 2019 at 06:04AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45986/mahesh-babu.html

No comments