Breaking News

ఈసారి మరలా సందేశాత్మక చిత్రమే!


సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఆగడు, బ్రహ్మోత్సవం, స్పైడర్‌ వంటి డిజాస్టర్ల నుంచి త్వరగానే పాఠం నేర్చుకున్నాడు. అందుకే ఆయన ఇటు సందేశాత్మక చిత్రాలకు, మరోవైపు ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ, సినిమా తర్వాత సినిమాని వెరైటీగా, భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇటీవల కాలంలో మహేష్‌ వరుసగా శ్రీమంతుడు, భరత్‌ అనే నేను, మహర్షి వంటి హార్ట్‌ టచింగ్‌ మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రాలను చేశాడు. 26వ చిత్రంగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో ఆయన చేయనున్న చిత్రం సందేశాలు గట్రా ఏమీ లేకుండా కామెడీ ఎంటర్‌టైనర్‌గా చేస్తున్నాడు. 

ఇక త్వరలో మహేష్‌ విదేశాలకు వెకేషన్‌ కోసం వెళ్లనున్నాడు. ఇప్పటికే ఆయన వెళ్లాల్సి ఉన్నా కూడా మహర్షి ప్రమోషన్స్‌ నేపధ్యంలో ఈ ట్రిప్‌ వాయిదా పడింది. త్వరలో మహేష్‌ విదేశాలకు వెళ్లి వచ్చిన తర్వాత జూన్‌లో అనిల్‌ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు. ఇదే నేపధ్యంలో గతంలోలాగా సినిమా సినిమాకి పెద్ద గ్యాప్‌ ఇవ్వకుండా వరుస చిత్రాలలో నటించాలని మహేష్‌ భావిస్తున్నాడు. ఇందు కోసం ఆయన తన 27వ చిత్రంగా గీతాఆర్ట్స్‌లో అల్లుఅరవింద్‌ నిర్మాతగా గీతాగోవిందం వంటి బ్లాక్‌బస్టర్‌ని ఇచ్చిన పరుశురాం చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి బైండెడ్‌ స్క్రిప్ట్‌ని దాదాపుగా పరుశురాం పూర్తి చేశాడట. ఈ చిత్రం ప్రస్తుతం సమాజాన్నిపీడిస్తున్న ఓ సమస్య ఆధారంగా రూపొందనుందని తెలుస్తోంది. 

అనిల్‌ రావిపూడి చిత్రంతో పూర్తి ఎంటర్‌టైనర్‌ చేసిన చిత్రం చేసిన వెంటనే మరో మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రంలో మహేష్‌ నటించడానికి ఒప్పుకోవడం విశేషం. అల్లుఅరవింద్‌ నిర్మాత కావడం, మంచి టాలెంట్‌ ఉన్న యంగ్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వం వహిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని కూడా సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు యూనిట్‌ సిద్దం అవుతోంది.



By May 19, 2019 at 01:46PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45995/mahesh-babu.html

No comments