Breaking News

విషాదం పక్కనపెట్టి సంతోషపడుతున్నారు!


స్టార్స్‌ చిత్రాల అప్‌డేట్స్‌ సామాన్యంగా బయటకు రావు. కేవలం లీక్‌ల రూపంలోనే అవి వస్తూ ఉంటాయి. అందుకే కొందరు వాటిని నమ్మరు. ఇదే విషయం మెగాస్టార్‌ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ‘సై..రా..నరసింహారెడ్డి’ చిత్రం చేస్తున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రంగా భారీ బడ్జెట్‌తో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా మెగాస్టార్‌ ‘బాహుబలి’ రికార్డులను టార్గెట్‌గా పెట్టుకున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సరైన అప్‌డేట్స్‌ రాకపోవడంతో ఈ చిత్రం షూటింగ్‌ ఆలస్యంగా జరుగుతోందని పలువురు భావిస్తూ వచ్చారు. 

నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘కొణిదెల బేనర్‌’ అధినేత రామ్‌చరణ్‌ సైతం ఈ చిత్రం దసరాకి దాదాపు రిలీజ్‌ అవుతుందని చెప్పినా వాటిని పట్టించుకోని కొందరు షూటింగ్‌ ఇంకా చాలా బ్యాలెన్స్‌ ఉందని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగుతుందని భావించారు. ఇక తాజాగా ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ శివారు ప్రాంతంలోని కోకాపేటలో వేసిన సెట్‌ అగ్నికి ఆహుతి అయింది. ఈ సెట్‌కి ఇన్సూరెన్స్‌ చేశారా? ‘మనం’ సెట్‌కి వచ్చినట్లుగా ఈ సెట్‌కి నష్టపరిహారం వస్తుందా? లేదా? అనేది పక్కనపెడితే చిత్ర యూనిట్‌ మాత్రం ఇదే సెట్‌లో సినిమాకి సంబంధించిన ఫైనల్‌ షెడ్యూల్‌ జరుగుతోందని తెలిపారు. 

దానిని బట్టి ఈ చిత్రం షూటింగ్‌ 95శాతం పూర్తి అయిందని, ప్రస్తుతం కాలిపోయిన సెట్‌ వల్ల కాస్త ఆలస్యం జరిగినా ఈ చిత్రం మాత్రం దసరా లేదా దీపావళికి రావడం ఖాయమని తెలుస్తోంది. దీంతో సెట్‌ కాలిపోయిన విషయం బాధిస్తున్నా తమ హీరో నటించే ఈ చిత్రం షూటింగ్‌ ఫైనల్‌ దశకు చేరుకుందని తెలిసి మెగాభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.



By May 06, 2019 at 04:30AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45812/sye-raa-narasimhara-reddy.html

No comments