Breaking News

లారెన్స్ శభాష్.. చెంపమీద కొట్టినట్టు చేశావ్!


సాధారణంగా కొత్తగా డైరెక్షన్‌ ఛాన్స్‌ వచ్చిన వారు తమ కెరీర్‌ మొదట్లో ఎన్ని అవమానాలు ఎదురైనా బయటకు చెప్పుకోకుండా తమకు వచ్చిన చాన్స్‌ని ఎలాగోలా సద్వినియోగం చేసుకోవాలని, అది తమకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తూ ఉంటారు. ఇక మన దక్షిణాది నుంచి పలువురు బాలీవుడ్‌ చిత్రాలకు దర్శకత్వం వహించినా అక్కడ తమను ఎవ్వరూ పట్టించుకోకపోయినా ఏమీ మాట్లాడకుండా మౌనం పాటిస్తారు. నిజానికి ఇది ఎప్పటి నుంచో వస్తున్న తంతు. దక్షిణాది దర్శకులంటే బిటౌన్‌ వారికి పెద్దగా గౌరవం ఉండదు. మీడియా కూడా వారిని సరిగా పట్టించుకోదు. ఇటీవల ‘కబీర్‌సింగ్‌’ ప్రమోషన్స్‌లో కూడా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాని అక్కడి మీడియా అసలు పట్టించుకోలేదని వార్తలు వచ్చాయి. 

ఇక విషయానికి వస్తే దక్షిణాదికి చెందిన ప్రభుదేవా ఇప్పటికే బాలీవుడ్‌కి దర్శకునిగా ఎగుమతి అయ్యాడు. ఆయన్ను అక్కడి మీడియా రీమేక్‌ దేవాగా చులకనగా చూస్తుంది. ఇది అందరి విషయంలో ఓకేగానీ రాఘవలారెన్స్‌ విషయంలో మాత్రం ఆ పప్పులు తన వద్ద ఉడకవని లారెన్స్‌ నిరూపించాడు. ఆయన బాలీవుడ్‌కి దర్శకునిగా తెరంగేట్రం చేస్తూ తన ‘కాంచన’ చిత్రాన్ని అక్షయ్‌కుమార్‌ హీరోగా ‘లక్ష్మీబాంబ్‌’ పేరుతో తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. తాజాగా రాఘవలారెన్స్‌ ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ‘లక్ష్మీబాంబ్‌’ని మించినబాంబ్‌ను పేల్చాడు. ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు. దీనికి సంబంధించిన కారణాలను లారెన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలిపాడు. 

ఇందులో దానికి గల కారణాలను కూడా ఆయన దాదాపుగా పొందుపరిచాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని తాజాగా విడుదల చేశారు. ఇందులో అక్షయ్‌కుమార్‌ హిజ్రాగా, ఓ మాంత్రికుడి గెటప్‌లో కనిపిస్తూ ఉన్నాడు. ఈ పోస్టర్‌కి మంచి స్పందన లభించింది. అయితే తాను దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని కనీసం తనకి నామమాత్రంగా కూడా తెలుపకుండా విడుదల చేయడంపై లారెన్స్‌ తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డియర్‌ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యాన్స్‌. తమిళంలో ఓ పాపులర్‌ కహాని ఉంది. ఎక్కడ నీకు గౌరవం దక్కదో ఆ ఇంటికి నువ్వు వెళ్లకూడదనేది దాని సారాంశం. ఈ విశాల ప్రపంచంలో డబ్బు, ఫేమ్‌ కన్నా ఆత్మగౌరవం అనేది ఎంతో ముఖ్యం. అది మన వ్యక్తిగత క్యారెక్టర్‌ని తెలియజేస్తుంది. అందుకే నేను ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నాను. కాంచన రీమేక్‌ లక్ష్మీబాంబ్‌కి ఇక నేను దర్శకత్వం వహించేది లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఫస్ట్‌లుక్‌ లాంఛ్‌ విషయాన్ని నేను వేరే వారి గురించి తెలుసుకోవాల్సివచ్చింది. దీనిని నేను ఎంతో పెయిన్‌ఫుల్‌గా భావిస్తున్నాను. అసలు నాకు గౌరవం లేనే లేదా? అని ఎంతో బాధపడ్డాను.. అని తెలిపాడు. మొత్తానికి లారెన్స్‌ ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో ఈ మూవీ ఉంటుందా? ఉంటే ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేవి తేలాల్సివుంది. మొత్తానికి ఈ విషయంలో లారెన్స్‌ని దిగ్రేట్‌ అని ఒప్పుకోవాలి.



By May 21, 2019 at 04:42PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/46028/akshay-kumar.html

No comments