Breaking News

‘ఏడు చేపల కథ’ టీజర్: వామ్మో ఏంటది?


ఏడు చేపల కథ సెన్సేషనల్ టీజర్ తో సోషల్ మీడియా అట్టుడికిపోతోంది. గతంలో విడుదల చేసిన టీజర్స్ తో సంచలనం సృష్టించింది. ఎప్పుడెప్పుడు విడుదలౌతుందా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఇదే ఊపును ప్రదర్శిస్తూ మరో టీజర్ ను విడుదల చేశారు. మొదటి టీజర్ ను మించిన రెస్పాన్స్ ఈ టీజర్ కు వస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ టీజర్ తో ట్రేడ్ సర్కిల్స్ లో విపరీతమైన చర్చ జరుగుతోంది. పూర్తి అడల్డ్ కామెడీ జోనర్ లో కొత్త వారితో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తో బిజినెస్ స‌ర్కిల్ లో హ్యూజ్ బ‌జ్ రావ‌టం విశేషం. అభిషేక్ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భాను శ్రీ, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జివిఎన్ నిర్మిస్తున్నారు.  

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... ‘‘ఆడవాళ్ల మీద మగవారు చేసిన అఘాయిత్యాలు... ఆధారాలు లేకపోయినా, ఆరు సంవత్సరాల తర్వాత అయినా మనం నమ్ముతున్నాం. కానీ మగాళ్ల మీద ఆడవారు చేసే అఘాయిత్యాలను ఆధారాలతో అరిచి ఘీ పెట్టి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అందుకే మగవారి తరపున  MeToo అంటూ టెమ్ట్ రవి అనే ప్రయోగాత్మక పాత్రను ‘ఏడు చేపల కథ’ చిత్రంతో పరిచయం చేస్తున్నాం.  పూర్తి అడల్డ్ కామెడీ జోనర్ లో రూపొందించిన ఈ చిత్రం యెక్క టీజ‌ర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ట్రేడ్ సర్కిల్స్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. దర్శకుడు శామ్ జే చైతన్య విభిన్నమైన కాన్సెప్ట్ ను రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా మలిచాడు. ఆద్యంతం ఆసక్తి కలిగించే సన్నివేశాలతో ఏడు చేపల కథ నడుస్తుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’. అని అన్నారు. 

నటీనటులు

అభిషేక్ రెడ్డి, భానుశ్రీ, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు

సాంకేతిక వర్గం

బ్యానర్ - చరిత సినిమా ఆర్ట్స్

సమర్పణ - డా.రాకేష్ రెడ్డి

నిర్మాతలు - శేఖర్ రెడ్డి, జివిఎన్

సహ నిర్మాత - గుండ్ర లక్ష్మీ రెడ్డి

సంగీతం - కవి శంకర్ 

కెమెరా - ఆర్లీ 

పిఆర్ఓ - ఏలూరు శ్రీను 

రచన, దర్శకత్వం - శామ్ జే  చైతన్య



By May 04, 2019 at 03:28PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45799/yedu-chepala-katha.html

No comments