Breaking News

సుక్కు అడవి బాట పట్టాడు..!


అల్లుఅర్జున్‌.. నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా తర్వాత ఏడాది గ్యాప్‌కి ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తో చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తల్లిదండ్రులు-కుమారుడి మధ్య సాగే ఎమోషన్స్‌తో కమర్షియల్‌ హంగులతో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందని సమాచారం. ఇదే సమయంలో అల్లుఅర్జున్‌ ఆ తదుపరి రెండు చిత్రాలను కూడా లైన్‌లో పెట్టాడు. ‘ఎంసీఏ’ దర్శకుడు వేణుశ్రీరాంతో ‘ఐకాన్‌’ టైటిల్‌తో ఓ చిత్రంతో పాటు సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ బేనర్‌లో మరో చిత్రం చేయనున్నాడు. 

ఇటీవల సుకుమార్‌ చిత్రం కంటే వేణుశ్రీరాం చిత్రమే ముందుగా ప్రారంభం అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ సుకుమార్‌తో మైత్రి మూవీ మేకర్స్‌ బేనర్‌లో చేయబోయే చిత్రానికి మే 11నే ముహూర్తంగా నిర్ణయించారని, త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్‌ అనంతరం సుకుమార్‌తోనే ముందుగా బన్నీ ముందుకు వెళ్లున్నాడని సమాచారం. మహేష్‌ కోసం సుకుమార్‌ తయారు చేసిన ఎర్రచందనం స్మగ్లర్ల నేపధ్యంలో సాగే కథనే బన్నీకి తగ్గ మార్పులు చేర్పులతో సుక్కు ముందుకెళ్తున్నాడట. ఈ అడవుల కోసం తిరుమలలోని శేషాచలం అడవులను పరిశీలిస్తున్నారని సమాచారం. ఇక్కడ అనుమతులు కష్టమైతే ప్రత్యామ్నాయంగా కర్ణాటక అడువులను లేదా హైదరాబాద్‌లో సెట్స్‌ వేసి చిత్రీకరిస్తారని సమాచారం. 



By May 09, 2019 at 05:00PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45870/allu-arjun.html

No comments