Breaking News

మహేష్‌ బాబు మాటల్లో అర్ధం ఇదేనా..?


మహేష్‌బాబు.. సూపర్‌స్టార్‌గా వరుస చిత్రాలను చేస్తూనే దక్షిణాదిలో అందరి స్టార్స్‌ కంటే ఎక్కువగా మల్టీనేషనల్‌ బ్రాండ్స్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా, పలు యాడ్స్‌లో నటిస్తూ నాలుగురాళ్లు వెనకేసుకొస్తున్నాడు. తన తండ్రి బాటలో నడిస్తే ఆర్ధికంగా కష్టమని భావించి, బావ బావే పేకాట పేకాటే అనే తత్వాన్ని జీర్ణించుకున్నాడు. ఏషియన్‌ సునీల్‌ నారంగ్‌తో కలిసి ఎఎంబీ సినిమా మాల్స్‌ని విస్తరించే పనిలో ఉన్నాడు. అదే సమయంలో ఆయన జి. మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. దీనికి ఆయన శ్రీమతి నమ్రతా మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సోనీ పిక్చర్స్‌తో కలిసి ఆయన అడవి శేషు హీరోగా ‘మేజర్‌’ అనే చిత్రనిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నాడు. 

తాజాగా ఆయన రౌడీస్టార్‌, టాలీవుడ్‌ సెన్సేషనల్‌ స్టార్‌ వంటి బిరుదులను అతి తక్కువ సమయంలో అందుకుని స్టార్‌గా వెలుగొందుతున్న విజయ్‌ దేవరకొండతో తదుపరి చిత్రం చేయాలని నిర్ణయించాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగానే దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడట. ప్రస్తుతం మహేష్‌ ‘మహర్షి’ చిత్రం బిజీలో ఉన్నాడు. మరోవైపు తదుపరి చిత్రాన్ని అనిల్‌రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. సందీప్‌రెడ్డి వంగా విషయానికి వస్తే ఆయన తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ని ‘కబీర్‌సింగ్‌’గా షాహిద్‌కపూర్‌తో బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నాడు. ‘కబీర్‌సింగ్‌’ పూర్తి కాగానే సందీప్‌ చేయబోయే చిత్రం ఇదేనని సమాచారం. మొదట్లో అందరు సందీప్‌రెడ్డివంగా, మహేష్‌కి కథ వినిపించాడని ఆయనతో ఓ చిత్రం చేయనున్నాడని భావించారు. ఈ చిత్రంలో కాజల్‌ నటిస్తోందని, మహేష్‌ మెకానిక్‌ పాత్రను చేయనున్నాడని పలు వార్తలు వచ్చాయి. కానీ మహేష్‌ చేయబోయేది సందీప్‌రెడ్డివంగా-విజయ్‌దేవరకొండల చిత్రమని తాజా సమాచారం. 

ఇక మహేష్‌ మహర్షి ప్రమోషన్స్‌లో కూడా ఏదైనా స్టోరీ నాకు నచ్చి నేను నటించే అవకాశం లేకపోతే అలాంటి కథలతో బయటి కథానాయకులతో చిత్రాలు తీస్తానని చెప్పడం, మహర్షి వేడుకకు విజయ్‌దేవరకొండనే ముఖ్య అతిథిగా రావడం వంటివి దీన్ని బలపరుస్తున్నాయి. ఇక సందీప్‌రెడ్డి తీస్తున్న కబీర్‌సింగ్‌ జూన్‌21న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సబ్జెక్ట్‌ టాలీవుడ్‌ ప్రేక్షకుల కంటే బాలీవుడ్‌ వారిని అంతకు మించి ఆకట్టుకుంటుందని, అందుకే సందీప్‌ బాలీవుడ్‌కి తగ్గట్లు ఫ్లేవర్‌ మిస్‌ కాకుండా మరింత బోల్డ్‌గా దీనిని తీస్తున్నాడని తెలుస్తోంది. షాహిద్‌కపూర్‌కి జోడీగా కియారా అద్వానీ నటిస్తుండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రంపై ఓ కన్నేసి ఉన్నారు. 

ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల తేదీని కూడా అనౌన్స్‌చేశారు. ఈనెల 13న ట్రైలర్‌ని విడుదల చేసి అనంతరం ప్రమోషన్ల వేగాన్ని పెంచనున్నారు. దీనికి పోటీ అనుకున్న కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి కంగనారౌనత్‌, రాజ్‌కుమార్‌రావు జంటగా తీస్తున్న ‘మెంటల్‌క్యాహై’ విడుదల తేదీ మారడంతో ఈ చిత్రానికి ఇక బాలీవుడ్‌లో పోటీ ఉండదనే నమ్మకం వ్యక్తమవుతోంది. ఇటీవలే తెలుగు ‘టెంపర్‌’ బాలీవుడ్‌లో పెద్ద హిట్‌ కావడంతో ‘కబీర్‌సింగ్‌’ కూడా బాలీవుడ్‌ని దున్నేస్తుందని నిర్మాతలు కూడా ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. 



By May 10, 2019 at 05:50AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45874/mahesh-babu.html

No comments