Breaking News

ప్రభాస్, బన్నీ.. ‘మహర్షి’ కోసం..!


సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక 25వ చిత్రం ‘మహర్షి’ ఈనెల 9న విడుదలకు సిద్దమైంది. మొదట్లో నిర్మాతల మధ్య విభేదాలు వచ్చాయని, దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్స్‌ కూడా సరిగా క్యాచీగా లేవని నెగటివ్‌ ప్రచారం జరిగింది. కానీ చివరి పాట విడుదలై ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ తర్వాత ఈ వేసవిలోనే కాదు.. దరిదాపుల్లో కూడా ఏ పెద్ద సినిమా లేకపోవడం ‘మహర్షి’కి ప్లస్‌ పాయింట్‌ అయింది. ఇక సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వచ్చి బ్లాక్‌బస్టర్‌ అయితే కలెక్షన్ల సునామీ తప్పదని చెప్పవచ్చు. 

మరో వైపు ఈ చిత్రం నుంచి తనకి 10కోట్లు వాటా రావాలని అశ్వనీదత్‌ మొండివైఖరిగా వ్యవహరిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనిని మహేషే స్వంతంగా పరిష్కరించాడట. దిల్‌రాజు ఈ చిత్రానికి అనుకున్న బడ్జెట్‌ కంటే ఎక్కువైంది. భారీగా బిజినెస్‌ జరిగినా మిగిలింది ఏమీ లేదని చెబుతూ వచ్చాడని, కానీ అశ్వనీదత్‌ మొండివైఖరి కారణంగా మహేష్‌ అశ్వనీదత్‌కి ఏడుకోట్లు ఇప్పించాడని తెలుస్తోంది. ఇకపై ఈ చిత్రం భారీ విజయం సాధించినా అశ్వనీదత్‌కి ఏమాత్రం వాటా ఉండదు. మొత్తం దిల్‌రాజు, పివిపిలకే దక్కుతుంది. అశ్వనీదత్‌ తీరుపట్ల దిల్‌రాజు, పివిపిలే కాదు.. మహేష్‌ కూడా కినుక వహించాడని అంటున్నారు.

తనని హీరోగా పరిచయం చేసిన మొదటి చిత్రం నిర్మాత కావడం, ‘సైనికుడు’ ద్వారా భారీ నష్టాలు భరించినందు వల్ల ఏదో దయదలచి మహేష్‌ ఇందులో అశ్వనీదత్‌కి భాగం ఇస్తే ఆయన మహేష్‌ని విసిగించి, ఆయన వద్ద చెడ్డ పేరు తెచ్చుకున్నాడని సమాచారం. మరోవైపు ఈ చిత్రం బిజినెస్‌లో బన్నీ, ప్రభాస్‌లకు కూడా ప్రమేయం ఉందని, ఈ విధంగా బన్నీ, ప్రభాస్‌ అభిమానులు కూడా ‘మహర్షి’ని చూసే విధంగా సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయిందని తెలుస్తోంది. 

ఈ చిత్రం కృష్ణా హక్కులను దిల్‌రాజు.. బన్నీకి చెందిన గీతాఆర్ట్స్‌-ప్రభాస్‌కి చెందిన యువి సంస్థలకు ఇవ్వడంతో.. ఈ స్ట్రాటర్జీ బన్నీ, ప్రభాస్‌ల అభిమానులపై కూడా సానుకూల ప్రభావం చూపేలా మహేష్‌ మ్యాజిక్‌ చేశాడని అంటున్నారు. 



By May 07, 2019 at 02:33AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45827/geetha-arts.html

No comments