Breaking News

సడెన్‌గా జాయినై.. సమంత షాకిచ్చింది


  • మామతో కలిసి నటిస్తున్న అక్కినేని కోడలు
  • ‘మన్మథుడు2’లో జాయిన్ అయిన సమంత
  • విషయం చెబుతూ రాహుల్ రవీంద్రన్ ట్వీట్

సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలు, పుకార్లు కొన్నిసార్లు నమ్మబుద్దికాదు. కానీ సరైన విషయ నిర్ధారణ లేకుండా ఎవ్వరూ వార్తలు రాయరు. అందుకే నిప్పులేనిదే పొగరాదు అంటారు. ఇక విషయానికి వస్తే సమంత అక్కినేని పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాతే విభిన్న చిత్రాలలో నటిస్తూ తన సత్తా చాటుతోంది. పెళ్లికి ముందు ఆమె కూడ ఎవరో ఒక హీరో పక్కన జోడీ ఉండాలి? కదా అనేటువంటి పాత్రలు చేసింది. కానీ పెళ్లయిన తర్వాత మాత్రం ఛాలెంజింగ్‌ పాత్రలకే ఓటు వేస్తోంది. దాంతో ఈమెకి వరస విజయాలు, ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. 

ముఖ్యంగా పెళ్లయిన తర్వాత తాను తన భర్త నాగచైతన్యతో కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రం విజయం ఆమెలో ఎక్కువ సంతోషాన్ని నింపిందనే చెప్పాలి. కాగా ప్రస్తుతం ఆమె నందినిరెడ్డి దర్శకత్వంలో సురేష్‌బాబు సమర్పణలో ‘ఓ బేబీ’ చేస్తోంది. ఇక దిల్‌రాజు నిర్మాతగా తమిళంలో సూపర్‌హిట్‌ అయిన విభిన్నకథా చిత్రం ‘96’ రీమేక్‌లో శర్వానంద్‌తో కలిసి యాక్ట్‌ చేస్తోంది. అయితే వీటి కంటే ముందే ఆమె మరో చిత్రం షూటింగ్‌లో పాల్గొని సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. అదే ‘మన్మథుడు2’. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో చిన్న కామియో పాత్రను సమంత చేస్తోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. 

తాజాగా ఆమె పోర్చుగల్‌ షూటింగ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ ట్విట్టర్‌ ఖాతాలో ఓ ఫొటోని షేర్‌ చేశాడు. ‘బెస్ట్‌ ఫ్రెండ్స్‌ కలిసి పనిచేస్తే వర్క్‌ అంతా ఫన్‌గా ఉంటుంది’ అని ట్వీట్‌ చేశాడు. ఈ ఫొటోలో రాహుల్‌ రవీంద్రన్‌, సమంత, వెన్నెల కిషోర్‌లు ఉన్నారు. పెళ్లి కాకముందు ‘మనం’లో ఆ తర్వాత ‘రాజుగారి గది2’లో మామగారితో కలిసి నటించిన సమంత ముచ్చటగా మూడో సారి నాగ్‌తో కలిసి నటిస్తూ ఉండటం విశేషం. ఇక ఈ చిత్రంలో నాగచైతన్య కూడా ఓ కీలక పాత్రను చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతో చూడాలి.



By May 04, 2019 at 05:36AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45790/samantha.html

No comments