Breaking News

‘మహర్షి’ సెన్సార్ రిపోర్ట్: హైలెట్స్ సీన్స్ ఇవే!


మహేష్ మహర్షి మూవీ విడుదలకు కౌన్ డౌన్ స్టార్ట్ అయ్యింది. వచ్చే గురువారం అంటే మే 9 న విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్న మహర్షి సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. 140 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో బాక్సాఫీసు బరిలోకి దిగుతున్న మహర్షి మీద మేకర్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. యు/ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్న మహర్షి సినిమాలో కొన్ని సన్నివేశాలు హైలెట్ గా నిలవబోతున్నాయని చెబుతున్నారు. ముందునుండి చెబుతున్నట్టుగా దర్శకుడు వంశి పైడిపల్లి అల్లరి నరేష్ ఎపిసోడ్ తో పాటుగా... పూజ - అల్లరి - మహేష్ మధ్యన వచ్చే స్నేహ సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించాడని మహర్షి టీం చెబుతుంది.

అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే రామవరం ఎపిసోడ్, గతంలో భరత్ అనే నేను సినిమాలో మహేష్ పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ కి ఎంత పేరైతే వచ్చిందో... ఇప్పుడు మహర్షి సినిమాలో మహేష్ పెట్టిన ప్రెస్ మీట్ కి అంతే పేరొస్తుందని అంటున్నారు. ఇక నైట్ ఫైట్ సీక్వెన్స్ ఈ చిత్రానికి ఆయువు పట్టుగా నిలుస్తాయట. అలాగే నిర్మాత దిల్ రాజు చెప్పినట్టుగా క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉండి కంటతడి పెట్టిస్తుందని... మహర్షికి క్లైమాక్స్ కూడా బలమంటున్నారు. మరి ఇన్ని హైలెట్స్ తో విడుదలకాబోతున్న మహర్షిలో విషయమెంతుందో మే9 న తెలిసిపోతుంది. 



By May 05, 2019 at 09:40AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45807/mahesh-babu.html

No comments