Breaking News

హీరోయిన్ కోసం RRR కథ మార్చడమా?


హీరోస్ కోసం కథలు మారుస్తారు అని తెలుసు కానీ హీరోయిన్స్ కోసం కథలు మారుస్తారని ఈ రూమర్ వింటే అర్ధం అవుతుంది. రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్’ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌ నటిస్తున్నట్లు తెలిసిన విషయమే. ఈమె కోసం కథలో కొన్ని మార్పులు చేస్తున్నారని బాలీవుడ్ కథనాలు ప్రకారం సమాచారం. 

అసలు మొదట శ్రద్ద ప్లేస్ లో హాలీవుడ్ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్‌ తారక్ కి  జోడిగా నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల డైసీ సినిమా నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ప్లేస్ లోకి శ్రద్ధను ఎంపికచేయబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

ఎంచుకుంటే ఎంచుకున్నారు కానీ అసలు కథలో మార్పులు చేయాల్సిన అవసరం ఏంటి? మరి కథలో మార్పులు చేసాకా శ్రద్ధా కపూర్‌ డేట్స్‌ కుదరకపోతే పరిస్దితి ఏమిటి అంటే…. పరిణీతి చోప్రాను ఎంపిక చేసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందిట. ఇదంతా చూస్తుంటే ఏదో గాసిప్ లాగ అనిపించటం లేదు. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అయితే హీరోయిన్స్ కోసం కథలో మార్పులు చేస్తారు కానీ ఇటువంటి సినిమాల్లో అంటే కష్టం. సోదంతా ఒక రూమర్ అని కొట్టిపారేయడమే. RRR లో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్‌ కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే తారక్ కి జోడి ఎవరూ అనేది తెలియనుంది.



By April 21, 2019 at 02:07PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45615/rajamouli.html

No comments